నారద వర్తమాన సమాచారం
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు చేయండి : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన కోసం బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ముఖ్యమంత్రి మొదటి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ పీజీఆరెస్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సన్నాహక సమావేశం నిర్వహించారు.
గురజాల మండలం, పులిపాడు గ్రామంలో జనవరి 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ, గ్రామ సభ వంటి కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి పర్యటన ఆద్యంతం పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటిస్తూ బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరా, నాణ్యమైన పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. పర్యటనలో పాల్గొనే ప్రజల కోసం తగిన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
నెలలో మూడో శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర ఆశయాలకు తగ్గట్టు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యాలయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఘన వ్యర్థాలను తొలగించడం చేయాలన్నారు. పౌర సేవలు నిర్లక్ష్యం చేయకుండా రేపు ఉదయం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఆర్.డి.వో మురళి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.