నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 63 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
నరసరావుపేట వాస్తవ్యులు ముండ్రు శివప్రసాద్ అను అతను 2023 మే నెలలో ICF Corporation కంపెనీవారు జాబ్ రిక్వైర్మెంట్స్ లో వేసిన పేపర్ యాడ్ చూసి జాబ్ కొరకు దరఖాస్తు చేసుకున్నట్లు, వారు మార్కెటింగ్ అసోసియేట్ నందు శివ ప్రసాద్ ను జాబు లోకి తీసుకొని టార్గెట్ లో భాగంగా 10 లోన్ ఫైల్స్ చెయ్యాలని టార్గెట్ ఇచ్చినట్లు, అందుకుగాను 10 మంది దగ్గర శివప్రసాద్ కంపెనీ వారు చెప్పిన విధంగా 5% ఇంట్రెస్ట్ తో లోన్ ఇచ్చు లాగా వారి దరఖాస్తులు కంపెనీ వారికి పంపగా, కంపెనీ వారు శివప్రసాద్ కు తెలియకుండా 10 మంది దగ్గర నుండి మీకు లోన్ అప్రూవ్ కావాలి అంటే మాకు లాగిన్, ఇన్సూరెన్స్, లీగల్ సెక్యూరిటీ కి సంబంధించి 60,000 నుండి 80,000 ముందుగా కట్టాలని చెప్పి ముందుగా కట్టించుకున్నట్లు, వారు తక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని ఆశపడి అడిగిన అమౌంట్ కట్టగా, కట్టిన వారు డబ్బులు చెల్లించి సంవత్సరం అవుతున్నా ఇంకా లోన్ రాకపోవడంతో వారు నువ్వే కదా మా దరఖాస్తులు అప్లై చేసింది కావున మా డబ్బులు మాకు ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నందుకు గాను సదరు కంపెనీ వారికి డబ్బులు ఇవ్వమని ఎన్నోసార్లు ఫోన్ చేసిన, మెయిల్ చేసిన తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా మోసం చేసిన కంపెనీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది .
సత్తెనపల్లి టౌన్ కు చెందిన ధరణికోట వెంకటలక్ష్మి భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని గత 1 1/2 కాలం నుండి ఇంటికి రాకుండా ఆమె వద్దనే ఉంటూ ఇంటి అద్దె,ఇంటి ఖర్చులు, పిల్లలు బాగోగులు ఏమి పట్టించుకోకుండా ఫిర్యాదు బంగారం కూడా సదరు మహిళ వద్ద తన భర్త ఉంచినట్లు, అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళా మరియు ఆమె అక్క కలిసి కొట్టడానికి వచ్చి భయపెడుతున్నారని ఫిర్యాదు తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.
బొల్లాపల్లి మండలం గండిగనుముల తండాకు చెందిన వాంకడావత్ భీక్యా నాయక్ అను అతనికి 171-5-B సర్వే నంబర్ నందు 1.70 సెంట్లు మరియు 171/8-B లో 1.42 సెంట్లు మొత్తం సాగు వ్యవసాయ భూమి 3 ఎకరాల 12 సెంట్లు ఉన్నట్లు, ఈ పొలాలకు సంబంధించి గత 18 సంవత్సరాల నుండి రాకపోకల కాలి బాట ఉండగా ఫిర్యాదు దారుని పక్క పొలం వారైన వాంకనావత్ బాలు నాయక్, వాంకనావత్ శంకర్ నాయక్, వాంకనావత్ కుమార్ నాయక్ వారు పొలానికి వెళ్లకుండా అడ్డుకుంటు ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఫిర్యాది ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామానికి చెందిన ముప్పాళ్ళ కోటేశ్వర రావు అను అతను “SS EDUCATIONAL SOCIETY” నందు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినందున ఎడ్యుకేషనల్ సొసైటీ కి బ్యాంక్ అకౌంట్ అవసరం అవడంతో ఏప్రిల్ నెల 2024లో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కొరకు నరసరావుపేట పట్టణంలోని HDFC బ్యాంకులో RM గా పనిచేస్తున్న శొంఠి రఘురాం నీ కలిసినట్లు,
అకౌంట్ ఓపెనింగ్ కు సంబంధించి సొసైటీ రిజిస్ట్రేషన్, సొసైటీ పాన్ కార్డ్, సొసైటీ By-Laws అకౌంట్ ఓపెనింగ్ డిపాజిట్ గా 5,00,000/- రూపాయలు ఖాళీ చెక్కు కావాలని వివరించినట్లు, ఈ ప్రాసెస్ కు రెండు నుంచి మూడు నెలలు పడుతుంది అని తెలియజేస్తూ,
5,00,000/- రూపాయల ఖాళీ చెక్కు మొదటగా HDFC బ్యాంకు కు సంబంధించిన డమ్మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందని, ఆ తర్వాత డమ్మీ ఎకౌంటు నుండి కొత్తగా ఓపెన్ చేసిన HDFC బ్యాంక్ అకౌంట్ కు క్రెడిట్ అవుతాయని తెలియపరచడం జరిగింది.
పైన తెలిపిన ప్రకారం కాగితాలు మరియు ఖాళీ చెక్కు ఇవ్వగా ది.06.05.2024 న ఫిర్యాదు ప్రాసెస్ చెయ్యమన్న “SS EDUCATIONAL SOCIETY” ఎకౌంటు ఓపెన్ అయిందని రఘురాం సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ ఐదు లక్షల రూపాయలు ఆ ఖాతా నందు డిపాజిట్ కాలేదు అని గట్టిగా అడుగగా రఘు ం ఫిర్యాదు దారునితో నన్ను ఇబ్బంది పెట్టడం గాని, నా మీద ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వడం గానీ చేస్తే మీ సంస్థ గురించి నెగిటివ్ గా రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించుచున్నట్లు, కావున అకౌంట్ ఓపెనింగ్ డిపాజిట్ కొరకు ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఉద్దేశపూర్వకంగా మోసం చేసినట్లు మరియు ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నందుకు గాను సొంటి రఘురాం మీద చట్టపరమైన చర్యలు తీసుకున వలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
వెల్దుర్తి గ్రామం & మండలం నకు చెందిన పులుసు వెంకటేశ్వర్ రెడ్డి కు మిత్రుడైన రాజశేఖర్ రెడ్డి ద్వారా ఆరమంద రవిబాబు పరిచయమైనట్లు, ఆరమంద రవిబాబు ఫిర్యాదుదారునికి ఇరిగేషన్ శాఖ నందు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని NEFT ద్వారా 19/06/2023 వ తేదీన 6,00,000/- రూపాయలు, మరియు 20/06/2022 వ తేదీన 2,50,000/- రూపాయలు మొత్తం 8,50,000/- రూపాయలు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు అడగగా తిరిగి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఇబ్బందులకు చేస్తున్నందుకు గాను ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నూజెండ్ల మండలం మాలపాటి దుర్గాభవాని అను ఆమెను మహమ్మద్ ఇమ్రాన్ అన్సారి అను అతను దొంగ పెళ్లి చేసుకుని 6సంవత్సరాలుగా శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని ఇప్పుడు ఫిర్యాదుని నువ్వు భార్య కాదు అని అంటూ ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఫిర్యాదు
తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీని కలిసి అర్జీ ఇవ్వడమైనది.
నరసరావుపేట అరండల్ పేట కు చెందిన కూనాల రాజేష్ స్నేహితుడు అయిన జడా గణేష్ తను జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాన,ని ఫిర్యాదిని జర్మనీ తీసుకొని వెళ్లి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఫిర్యాదు వద్ద నుండి 10,30,000/- రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినందుకు గాను న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి జీవించడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.