నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
క్రిస్మస్ పర్వదిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నాం:జిల్లా ఎస్పీ
పల్నాడు జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 25 బుధవారం రోజున జరగనున్న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా ప్రార్థన స్థలాల వద్ద, ముఖ్యమైన ప్రదేశాలలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ డిసెంబర్ 24న మంగళవారం రాత్రి నుండి క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రార్థనలు నిర్వహిస్తారాన్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రార్థన మందిరాలకు వెళ్లి ప్రార్థనలలో పాల్గొంటారన్నారు. దానికి తగిన విధంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు.
రాత్రి సమయాలలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రార్థన మందిరాలు, చర్చిలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి పోలీస్ శాఖ పరంగా తగిన రక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజల కూడా పోలీస్ అధికారులు సూచించే సూచనలకు అనుగుణంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సంతోషకరమైన వాతావరణంలో క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.
వాహనాలు నడిపేవారు మద్యం సేవించరాదని, ప్రమాదకర రీతిలో, ఇతరులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వాహనాలు నడపరాదన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.