నారద వర్తమాన సమాచారం
ఆర్ఎస్ఏఎస్టీఎఫ్
తిరుపతి జిల్లా, నాగలాపురం మండలం, రేప్పాల తిప్ప సమీపమున అటవీ ప్రాంతం లో ఆకస్మిక దాడులు జరిపిన ఎర్రచందనం పోలీసులు.
ముగ్గరు ఎర్రచందనం స్మగ్గ్లింగ్ చేసే పాత నేరస్తులు లతో పాటు ఐదు మంది కూలి లు అరెస్ట్:
సుమారు రూ. 20 లక్షలు విలువ గల 69 ఎర్రచందనం దుంగలు, బరువు 479 Kg లు మరియు ఒక మోటర్ సైకిల్ స్వాధీనం.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,
రెడ్ శాoడర్ టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ వారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్సు సిబ్బంది కి రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినం అనగా 23.12.2024 తేది రాత్రి తిరుపతి జిల్లా, నాగలాపురం మండలం, రేప్పాల తిప్ప సమీపమున అటవీ ప్రాంతం లో ఆకస్మిక దాడులు జరిపి అక్రమ రవాణా చేయడానికి ఎర్రచందన దుంగలు సిద్దం చేస్తున్న కె.వి పురుం కి చెందిన్హ సురేంద్ర, నాగలపురుం కి చెందిన మునివేలు, తమిళనాడు సేలం జిల్లా కు చెందిన మేస్త్రి సెల్వ రాజి తోరై స్వామి మరియు ఐదు మంది తమిళ కూలి లను అరెస్టు చేయడం జరిగిందన్నారు.
ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు ఇరవై లక్షల రూపాయలు ఉంటుందని ఇన్చార్జి టాస్క్ ఫోర్స్ జిల్లా ఎస్పి ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ అన్నారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన తిరుపతి టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ శ్రీనివాస్ వారిని, డీఎస్పీ ఎండీ షరీఫ్, ఆర్ఐ చిరంజీవి , ఇన్సప్టెక్టర్ ఎం. సురేష్ కుమార్, , ఆర్ ఎస్ ఐ నరేష్ మరియు ఇతర సిబ్బంది ని టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.