నారద వర్తమాన సమాచారం
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి.. మరికొందరి పరిస్థితి విషమం..
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మెంధార్ ప్రాంతం మీదుగా వెళ్తున్న ఆర్మీ వాహనం ఒక్కసారిగా లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 8 మందికి పైగా సైనికులు గాయపడినట్లు సమాచారం.
జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి ఐదుగురు మరణించారు.. మరో 8 మంది సైనికులకు తీవ్రగాయలయ్యాయి.. పూంచ్ జిల్లాలోని బాల్‌నోయ్ ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో ఆర్మీ వాహనం పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఉన్నతాధికారులు ప్రకటించారు.. వీరిలో ఇంకా చాలా మంది జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు బలగాలను మోహరించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆర్మీ రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్ (సైన్యం) తోపాటు జమ్ముకశ్మీర్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోతైన లోయలని పడిపోయిందని అధికారులు చెప్పారు. ఈ ప్రాంతం LOC సమీపంలో ఉందని పేర్కొన్నారు. సైనిక వాహనం సైనికులను పోస్ట్ వైపు తీసుకెళ్తోంది.. ఈ సమయంలో అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సైనికులను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గత నెలలో కూడా ఇలాంటి ప్రమాదం..
గత నెలలో కూడా జమ్మూ కాశ్మీర్‌లో ఇలాంటి ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదం నవంబర్ 4న కలకోట్‌లోని బడోగ్ గ్రామ సమీపంలో జరిగింది. ఇందులో హీరో బద్రీలాల్, కానిస్టేబుల్ జైప్రకాష్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.