Friday, December 27, 2024

ఏడుజాతీయ రహదారులతో అనుసంధానింపబడుతున్న అవుటర్‌ రింగ్‌రోడ్డులు…..

నారద వర్తమాన సమాచారం

అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ ఆర్‌) అలైన్‌మెంట్‌ జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే చోట గందరగోళం లేకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థకు నిర్దేశించింది.

ఈ ప్రాజెక్టు మొత్తం 7 జాతీయ రహదారులతో అనుసంధానమవుతుంది.

దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలతో అమరావతి రాజధానికి రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది.

ఈ అలైన్‌మెంట్‌ మలుపులు లేకుండా ఉండేలా చూడటంతో పాటు ఆయా జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. నేరుగా అనుసంధానం అయ్యే చోట ఈ జాగ్రత్తలు బాగా తీసుకోవాలని పేర్కొంది.

అలాగే, ట్రంపెట్‌ ఇంటర్‌ చేంజ్‌ల విషయంలో కూడా ఎలాంటి గందరగోళం, సమస్యలకు అవకాశం లేకుండా అనుసంధానమయ్యేలా చర్యలు చేపట్టాల్సిందిగా తెలిపింది.

దీంతో అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుతో అనుసంధానమయ్యే మచిలీపట్నం-హైదరాబాద్‌ (ఎన్‌హెచ్‌-65), కొండమోడు-పేరేచర్ల (ఎన్‌హెచ్‌-163ఈజీ), చెన్నై-కోల్‌కతా (ఎన్‌హెచ్‌-16), విజయవాడ-ఖమ్మం-నాగపూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే (ఎన్‌హెచ్‌-163జీ), గుంటూరు-అనంతపురం (ఎన్‌హెచ్‌-544డీ), ఇబ్రహీంపట్నం-జగదల్‌పూర్‌ (ఎన్‌హెచ్‌-30) వంటి వాటి విషయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు …


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading