నారద వర్తమాన సమాచారం
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్
పిడుగురాళ్ల :-
నూతన సంవత్సర ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి 1న కాకుండా ముందు రోజే పింఛన్ల పంపిణీకి అనుమతించాలని కొన్ని రోజులుగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసినదె ఈ సందర్భంగా ఉద్యోగుల వినతిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31న పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని • ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ప్రతిపాదన మేరకు డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయంతో డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామునే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ లో భాగంగా పట్టణంలో పలు వార్డులలో కమిషనర్ పర్వతనేని శ్రీధర్ మరియు.సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు వార్డు మరియు,సచివాలయ ఉద్యోగులు
పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.