నారద వర్తమాన సమాచారం
ఐదు కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్: చంద్రబాబు
యల్లమంద: ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే తన తపన అని పేర్కొన్నారు..
పల్నాడు జిల్లా యల్లమందలో చంద్రబాబు (Chandrababu) పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా సీఎం వెళ్లి.. వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
”గత ఐదేళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి. కనీసం నవ్వలేకపోయారు. ఇప్పుడు ఇంటింటికీ వచ్చి పింఛన్లు అందిస్తున్నాం. ఇంటి వద్ద కాకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తా. ఫోన్లో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుంది. డ్రోన్లను కూడా సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నాం. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఐదు కోట్ల మంది ప్రజల కోసమే నేను కష్టపడుతున్నా. ఏ ఇంట్లో కష్టమొచ్చినా వాళ్ల ఇంట్లో నేనొక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్లను కాపాడుకుంటాను. నేను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలనేదే నా ఆలోచన. నాకు హైకమాండ్ ఎవరూ లేరు. ఐదు కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్ ” అని చంద్రబాబు అన్నారు..
పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మరిచిపోలేమని చంద్రబాబు అన్నారు. 90 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని.. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.