నారద వర్తమాన సమాచారం
గుంటూరు జిల్లా పోలీస్…
తక్కువ ఖర్చులో విదేశాల్లో ఉన్నత విద్య అందిస్తామని చెప్పే కన్సల్టెన్సీ సంస్థల పట్ల జాగ్రత్త వహించండి.
- ఫిలిప్పీన్స్ దేశంలోనీ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని నగదు తీసుకుని మోసం చేసిన రైట్ ఛాయిస్ జెఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రై లిమిటెడ్ కన్సల్టెన్సీ సంస్థ.
- సంస్థకు చెందిన 7 మందిపై కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన వట్టిచెరుకూరు పోలీసులు.
- నకిలీ కన్సల్టెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించిన పోలీస్ అధికారులు.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సౌత్ డిఎస్పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్దాయిల అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన సౌత్ డిఎస్పి మల్లికార్జున రావు వట్టిచెరుకూరు సిఐ రామ నాయక్
శీలంనేని.శ్రీనివాసరావు గురజాల గ్రామం, పల్నాడు జిల్లా అనే అతను తన కొడుకు అయిన అనిల్ కుమార్ ని మెడిసిన్ చదివించాలని కన్సల్టెంట్స్ ని సంప్రదించే క్రమంలో, గుంటూరు పట్టణంలోని అరండల్ పేట 6/2, లో గల రైట్ ఛాయిస్ JS ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ PVT LTD. ఫౌండర్, డైరెక్టర్ అయిన కన్నా రవితేజ S/o శౌరీలు అను అతను, పిర్యాది వాళ్ళని సంప్రదించి ఫిలిప్పీన్స్ లోని పర్పెట్చువల్ హెల్ప్ మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తామని మరియు వారి సంస్థ ద్వారా చాలా మంది విద్యార్దులను ఉన్నత చదువుల కోసం పంపించామని చెప్పడం జరిగినది.
హైదరాబాద్ లో కూడా తమకు బ్రాంచి ఉందని, అక్కడ లోహిత మరియు రవి కుమార్ అను వారు పనిచేస్తున్నారని, స్టూడెంట్ వీసా దగ్గర నుండి కాలేజీలో & హాస్టల్ లో చేర్పించడం వరకు మొత్తం వారే చూసుకుంటామని చెప్పి నమ్మించి బాధితుడి వద్ద నుండి సుమారు రూ.21,59,000/- నగదును కట్టించుకుని, సదరు కాలేజీలో నగదు కట్టకుండా బాధితులను మోసం చేస్తూ, కాలేజీలో నగదు కట్టమని అడిగినందుకు బాధితుని కొడుకును భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు శీలం.శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వట్టిచెరుకూరు పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది.
పోలీస్ వారి దర్యాప్తులో మొత్తం 7 మంది ముద్దాయిలు ఈ మోసానికి పాల్పడ్డారని తేలినది. వారి వివరాలు :-
1).కన్నా. బాల రవితేజ, ముట్లూరు గ్రామం, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా.
2).కన్నా. బాల శౌరయ్య, ముట్లూరు గ్రామం, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా,
3).పెరమల.పల్లి లోహిత,
4).పార.రవి కుమార్, జగన్నాధ పురం గ్రామం,వీరులపాడు మండలం, NTR జిల్లా.
5).మురుపాల గీతికా,
6).నారాయణ పవన్ కళ్యాణ్,
7).పొలిమేర శివ.
పైన తెలిపిన 5,6,7గురు నిందితులు ఫిలిప్పీన్స్ దేశంలో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తారని సమాచారం.
ఈరోజు (01.01.2025) ముట్లూరు గ్రామంలో కన్న. బాల రవితేజ, కన్నా. బాల సౌరయ్య, పారా.రవికుమార్ అనే ముగ్గురిని వట్టిచేరుకూరు పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగినది.
ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు అయిన పెరమలపల్లి.లోహిత( హైదరాబాద్ బ్రాంచ్ నందు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఫిలిప్పీన్స్ దేశం వెళ్లి వస్తూ ఉంటుంది) , అదేవిధంగా ఫిలిప్పీన్స్ లో ఉంటున్న మురుపాల. గీతిక నారాయణ.పవన్ కళ్యాణ్, పొలిమేర.శివ అనే వారి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డిఎస్పి తెలిపారు.
నిందితులు బాధితుల వద్ద నుండి ఫీజుల కోసం నగదును కట్టించుకుని, సదరు కాలేజీల వారికి కట్టకుండా వారి సొంతానికి వాడుకుంటూ, విద్యార్దుల యొక్క పాస్ పోర్ట్ మరియు వీసాలను వీరివద్దనే ఉంచుకొని, కాలేజి ఫీజులు కట్టమని అడిగిన విద్యార్దులపై తప్పుడు కేసులు పెడతామని పిల్లల తల్లిదండ్రులను నిందితులు బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మా దర్యాప్తులో తెలినదని డిఎస్పీ తెలిపారు.
కావున ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నకిలీ కన్సల్టెన్సీల బారినపడి మోసపోరాదని, ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎవరైనా ఎటువంటి బెదిరింపులకు పాల్పడిన వెంటనే పోలీసు వారిని సంప్రదించాలని డిఎస్పీ సూచించారు.
నిందితులు కన్సల్టెన్సీ సంస్థ నందు ఉపయోగించిన ఒక లాప్టాప్, మూడు సెల్ ఫోన్లు, ఒక పాస్పోర్ట్ ను పోలీస్ వారు సీజ్ చేయడం జరిగినది.
నిందితులను అరెస్టు చేయడంలో కృషిచేసిన వట్టి చెరుకూరి సిఐ రామానాయక్ ని, హెడ్ కానిస్టేబుల్ B. శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు శేఖర్, ప్రకాష్ బాబు,ప్రసాద్, పోతురాజులను డిఎస్పీ అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.