Sunday, January 5, 2025

మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ –

నారద వర్తమాన సమాచారం

మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ –

మానవ శరీరం ఒక సజీవమైన యంత్రం శరీరము నందు ఎలాంటి అన్యపదార్ధము చేరినను దానిని బయటకి బహిష్కరింప చేయుటకు శరీరము పనిచేస్తుంది . ఉదాహరణకు కాలుకు ముల్లుగాని , కొయ్యగాని గుచ్చుకొని విరిగిన దానిని శరీరము నుంచి బయటకి పంపుటకు చీముపట్టి ఆ తరువాత సులభముగా బయటకి వచ్చును. ఇదే విధముగా శరీరంలోని అంతరావయవములలో ఏదేని మలపదార్దము ( అన్య పదార్థము లేదా రోగ పదార్థము ) చేరినచో అది బయటకి పంపుటకు శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు పనిచేయును . ఇప్పుడు వాటి గురించి మీకు వివరిస్తాను . అవి * ప్రేవులు . * మూత్రపిండములు . * ఉపిరితిత్తులు . * చర్మము .

  • ప్రేవులు – మల పదార్థము మొదట ప్రేవులలో నిలువచేరి వివిధ వ్యాధులను కలుగచేస్తుంది . అందువలనే " సర్వరోగా మలాశయః " అన్నారు. ఈ మల పదార్థం మలబద్ధక సమస్య వలన బయటకి వెళ్లక ప్రేవులలో నిలువ ఉండి అచ్చట కొంతకాలానికి మురిగిపోయి విషవాయువులు తయారైయ్యి రక్తములో కలిసి ప్రవహించి ఇతర అంతర అవయవములకు అవరోధము కలిగించి రోగములను కలుగచేయును . మలబద్ధకం వలన మొదట అజీర్ణము చేయును . అజీర్ణము వలన విరేచనములు ఆ తరువాత బంక విరేచనాలు , రక్తవిరేచనాలు , అమీబియాసిస్ , అసిడిటీ , అల్సర్ ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చును. ఇవన్నియు జీర్ణకోశ సంబంధ వ్యాదులు. ఈ వ్యాధులన్నింటికి మలబద్ధకమే కారణం . ఈ సమస్య ప్రారంభములోనే జాగ్రత్తవహించని యెడల దీర్ఘకాలిక వ్యాధిగా మారి తరువాత తీవ్ర సమస్యలు తెచ్చును . </code></pre></li>మూత్రపిండములు - ప్రేవులు పూర్తిగా పనిచేయని స్థితిలో శరీరంలోని మాలిన్యములు బయటకి పంపుటకు మూత్రపిండములు బాగుగా పనిచేయవలసి ఉంటుంది. అందుకే మలబద్దకం సమస్య ఉన్నవారికి మూత్రం అధికంగా వచ్చును. కొంతకాలమునకు మూత్రపిండములు కూడా అలసిపోయి చెడిపోవును . కావున మూత్రపిండములలో రాళ్లు , మూత్రనాళములో రాళ్లు , మూత్రకోశములో రాళ్లు మొదలగు వ్యాధులు సంభవించును . దీనివల్ల రక్తములో మూత్రము కలియుట , రక్తపోటు మొదలగు సమస్యలు కలుగును. ఊపిరితిత్తులు - మూత్రపిండ వ్యాధులకు మందులు వాడిన శరీరంలోని మురికిని బయటకి పంపుటకు ఉపిరితిత్తులు ప్రయత్నించును. దగ్గు , జలుబు , అలర్జీ , దమ్ము ద్వారా శరీరంలోని తెమడను బయటకి పంపుటకు ప్రయత్నించును. ఈ సమస్యను కూడా అణుచుటకు మందులు వాడుచున్న శరీరం నందలి మలిన పదార్థము చర్మము క్రిందికి వెళ్లి చర్మవ్యాధులను కలగచేయును . చర్మము - రక్తములో ఉన్న మాలిన్యాలను చర్మము ద్వారా బహిష్కరించుటకు ప్రయత్నించునప్పుడు గజ్జి , తామర , పుండ్లు , గడ్డల రూపములో కనిపించును. దీనిని మనం మందులతో అణిచివేయుచుండిన చర్మవ్యాధి , కుష్టు మొదలగు వ్యాధులు వచ్చును . పైన వివరించిన నాలుగు బహిష్కరణ అవయవాలు చక్కగా పనిచేసినంత కాలం ఏ రోగము దరిచేరదు . ఇందులో ఏ ఒక్కటి తన విధిని సరిగ్గా నిర్వర్తించలేకపోయినా శరీరము అంతా రోగగ్రస్తం అవుతుంది. అంతేకాని శరీరంలో వివిధ అవయవములకు సంబంధం లేదు అనుకోకూడదు. ఈవిధముగా శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు మందుల వలన దోషపూరితమై ఒకదాని పని ఇంకొకటి చేసి రోగగ్రస్తము అగును. కావున సమస్య మొదలగు క్రమము నందే సరైన జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు శరీరంలోని మాలిన్యాలను బయటకి పంపవలెను. ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయాన్నే లేవగానే మలవిసర్జనకు వెళుతున్నాము .మలబద్ధక సమస్య లేదనుకుంటున్నారు. నిజానికి రోజుకు రెండుసార్లు మలవిసర్జన చేయుట అత్యుత్తమ పద్దతి. అదేవిధముగా ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధములు తీసుకుని ఉదరమును మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలెను. ఉదయాన్నే మలవిసర్జన చేసినప్పుడు బయటకి వెళ్లునది కేవలం 60 % మాత్రమే . మిగిలిన 40 % ప్రేవులకు పట్టి ఉండును. అది అలా మురిగిపొయి విషవాయువులు వెలువడి రక్తములో కలిసి శరీరంలోని మిగతా అవయవాలకు చేరుకుని ఆయా అవయవ సంబంధ రోగాలను కలుగ చేయును . కావున ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధాలను తీసుకుని ఉదరము మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలసిందిగా ముఖ్య సూచన .</code></pre></li>

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading