Tuesday, February 4, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జె వి సంతోష్..


నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా
నరసరావుపేట.

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జె వి సంతోష్ (పరిపాలన విభాగం)

ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 84 ఫిర్యాదులు అందాయి.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలనిఅడిషనల్ ఎస్పీ సూచించారు.

రొంపిచర్ల మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన తుర్లపాటి పున్నయ్య కు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడ సంతానము.
సుమారు పది సంవత్సరాల క్రితం తన భార్య చనిపోవడంతో తన చిన్న కుమారుడైన తుర్లపాటి శ్రీనివాసరావు వద్ద ఉంటున్నట్లు, ఫిర్యాదు పేరు మీద ఉన్న మూడు ఎకరాల పొలమును తన చిన్న కుమారుడు అయిన తుర్లపాటి శ్రీనివాసరావు సాగు చేస్తుండగా ఇప్పుడు తన పెద్ద కుమారుడు మరియు కుమార్తె కలిసి భూమిని సాగు చేయనివ్వకుండా అడ్డుపడుతున్నందుకుగాను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వలసిందిగా అడిషనల్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది .

నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామానికి చెందిన మురళీకృష్ణ అను అతనికి సంవత్సరం క్రితం పాలడుగు మురళీకృష్ణ కొండ్రెడ్డి చంద్రశేఖర్ అనువాదులు వచ్చి స్థలం ఇప్పిస్తాము అంటూ 3 లక్షల రూపాయలు తీసుకొని ఎంతవరకు స్థలం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఫిర్యాదు తగిన న్యాయం కొరకు అడిషనల్ ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.

వినుగొండ మండలం జాలలపాలెం గ్రామానికి చెందిన గొట్టం గోవిందరాజులు అను అతను నరసరావుపేట పట్టణం రామిరెడ్డి పేట నివాసి అయిన పోక వెంకటనారాయణ వద్ద 10 లక్షల రూపాయల చెట్టు వేసినట్లు 25 నెలలు నెలకు 40 వేల రూపాయలు చొప్పున చెల్లించుటకు అంగీకరించి సభ్యునిగా చేరే అప్పట్లో రెండు ఖాళీ చెక్కులు సెక్యూరిటీ నిమిత్తం ఇవ్వడం జరగగా పోక వెంకట నారాయణ ఫిర్యాది అనుమతి లేకుండానే బ్యాంకు నందు ప్రజెంట్ చేసి 4,65,000/- రూపాయలు విత్ డ్రా చేసినందుకు గాను తనను మోసం చేసి, ఇబ్బంది పెడుతున్నందుకు గాను పోక వెంకటనారాయణ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనవలసినదిగా ఫిర్యాది అడిషనల్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

శావల్యాపురం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ముండ్రు లలితాంబ అను ఆమెను కాటం వెంకటేశ్వర్లు అను అతను ఫిర్యాదు పోషణ చూస్తాను అని అక్షరాల 4,00,000/- రూపాయలు తీసుకొని ఆమె బాగోగులు చూడకపోగా, ఫిర్యాదు వద్ద ఉన్న 1, 70,000 రూపాయల నోటు ఇస్తేనే చూస్తాను అదిరినట్లు కావున తనకు న్యాయం చేయవలసిందిగా అడిషనల్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

మాచర్ల మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన కార్యకర్తల విజయమ్మకు ఇద్దరు కుమారులు సంతానం.
వారిలో ఫిర్యాది పెద్ద కొడుకు అయిన అంజిరెడ్డికి రొంపిచర్ల గ్రామస్తులు కొల్లి వెంకటరమణారెడ్డి గారి కుమార్తె శిరీషతో వివాహం జరిపించగా పెళ్లి అయిన రెండు నెలలు ఫిర్యాదు వద్ద ఉండి బెంగళూరు వెళ్లి వస్తానని తన భార్యను తీసుకొని వెళ్ళినట్లు అప్పటినుండి ఫిర్యాదు కుమారుడు ఫిర్యాదితో మాట్లాడటం కానీ వారి వద్దకు రావడం కానీ జరగలేదని, ఫిర్యాది వియ్యంకుడు కల్లి వెంకటరమణారెడ్డి దంపతులను తన కుమారుడి గురించి అడిగితే అమెరికా వెళ్ళాడు అని చెప్పి నట్లు, ఫోన్లో మాట్లాడించండి అంటే మాట దాట వేస్తున్నట్లు, సుమారు 15 సంవత్సరముల నుండి ఫిర్యాది పెద్ద కుమారుడు అయిన ఆరికట్ల అంజరెడ్డి దూకి తెలియనందున విచారించి తమకు అప్పగించవలసిందిగా అడిషనల్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

నరసరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామ కాపురస్తురాలు అయిన గుండెబోయిన కుమారి సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం తన మొదటి భర్తతో విడిపోయి ఉంటున్నట్లుగా చింతలపూడి ఆదినారాయణ అను అతను పెండ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మబలికి ఇప్పుడు బూతులు తిడుతూ కొట్టి వేధిస్తునందుకుగాను అతనిపై చర్యలు తీసుకుని మనకు న్యాయం చేయవలసిందిగా  అడిషనల్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

నరసరావుపేట పట్టణమునకు చెందిన చిలంకూరి ఆదిలక్ష్మి, 70సంవత్సరాలు అను ఆమె భర్త కరోనాలు చనిపోయినట్లు,
ఫిర్యాదుకి ఆరోగ్య సమస్యలు ఉండటం వలన మందులకు అనారోగ్య చికిత్స కొరకు ఉపయోగకరంగా ఉంటుందని 10 లక్షల రూపాయలు డబ్బును గుంటూరుకు చెందిన ఆత్మకూరు రామారావు అను వ్యక్తికి వడ్డీకి ఇవ్వగా ఒక సంవత్సరం పాటు వడ్డీ డబ్బులు ఇచ్చి ప్రస్తుతం డబ్బులివ్వకుండా తిడుతున్నట్లు బెదిరిస్తున్నందుకు గాను ఫిర్యాదు ఇచ్చిన 10 లక్షల రూపాయలు ఇప్పించవలసిందిగా అడిషనల్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading