నారద వర్తమాన సమాచారం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా సంక్రాంతి తర్వాతే?
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీం పై కీలక అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇల్లు లేని నిరు పేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్న విషయం తెలిసిందే.
మొత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో ఆ డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను చొప్పున మంజూరు చేయనున్నారు. నిరుపేదలకు ప్రాధాన్యం ఇస్తుంది ప్రభుత్వం.
అయితే ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మా ఇళ్ళ కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80, 54,554 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రామాల్లో, గ్రామ కార్యదర్శులు, పురపాలిక వార్డు అధికారులతో ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేయిస్తున్నారు.
ఇంటి ఇంటికి వెళ్లి సర్వే చేపడుతున్నారు. లబ్ధిదారుల అన్ని వివరాలు పక్కగా తెలుసుకుంటు న్నారు. ఇప్పటివరకు 68, 57,216 దరఖాస్తులకు ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్ ద్వారా వివరాలను సేకరించారు.
అయితే యాప్ సర్వేలో ఏమైనా అక్రమాలు జరిగా యా? ఏమైనా తప్పుడు సమాచారం నమోదు చేశారా? అనే అంశాలపై తెలంగాణ గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ప్రత్యే కంగా క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
సర్వే పూర్తయిన వాటిలో సూపర్ చెక్ పేరుతో ఐదు శాతం అంటే దాదాపు 4.02 లక్షల దరఖాస్తులను గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు మళ్లీ సర్వే చేపట్టనున్నారు. గ్రామాల్లో ఎంపీడీవోలు, మున్సిపాలిటీలో కమీషనర్ లాగిన్ కు పంపిస్తారు.
సర్వే పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వేలు యాప్ లో నమోదు చేసిన వివరాలను చెక్ చేస్తారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.