పిడుగురాళ్ల,తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
పిడుగురాళ్ల :-
పిడుగురాళ్ల, జానపాడు రోడ్డు లో గల తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు చైర్మన్ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ
పండగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగను పల్లెల్లోనూ పట్టణాల్లోనూ సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని ఈ నూతన సంవత్సరంలో మన దేశానికి, రాష్ట్రానికి, అలాగే మన పట్టణానికి మంచి జరగాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు లోగిలలో సంక్రాంతి శోభ ఉట్టిపడే విధంగా తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రంగవల్లులతో హరివిల్లులును తలపించే విధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. అలాగే హరిదాసుల, కీర్తనలు, డూ డూ బసవన్నల దీవెనలు, రంగవల్లులలో,గొబ్బెమ్మలు జంగమదేవరల, జే గంటలు డమరుక నాదాల తో సంక్రాంతి శోభను సంతరించుకుంది. అలాగే చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు,పిల్లలకు భోగి పళ్ళు, భోగి మంటలు, పొంగళ్ళు గాలిపటాలు,హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్ చైర్మన్, బొల్లా బ్రహ్మనాయుడు, మరియు ప్రముఖ డాక్టర్ రావిపాటి వెంకటేశ్వర్లు పట్టణ సీఐ వెంకట్రావు,ఉపాధ్యాయలు, విద్యార్థి,విద్యార్థినీలు పట్టణ, గ్రామ ప్రజలు, ప్రముఖులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.