నారద వర్తమాన సమాచారం
సంస్కృతి, సాంప్రదాయాలు తెలిపేదే సంక్రాంతి
తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేందుకు సంక్రాంతి సంబరాలు ఎంతగానో దోహదపడతాయని వైద్యాధికారులు డాక్టర్ ధనుష్ డాక్టర్ మహమ్మద్ షాద్ డాక్టర్ సిరి చందన లు అన్నారు శనివారం పల్నాడు జిల్లా క్రోసురు మండలం క్రోసూర్ పిహెచ్సిలో జరిగిన సంక్రాంతి వేడుకలలో వారు పాల్గొని అన్నారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ రంగవల్లులు మరియు వివిధ పోటీలలో గెలుపొందిన వారికి వైద్యాధికారుల చేతుల మీదగా బహుమతి ప్రధానం చేశారు వక్తలు మాట్లాడుతూ సంక్రాంతి ప్రజలందరికీ జీవితాల్లో వెలుగు నింపాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రజానీకం అందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగులకు ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చిన్న పిల్లలను రేగిపళ్ళతో అభిషేకించి వారికి ఆరోగ్యం చేకూర్చాలని ఆకాంక్షించారు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు భోగి పళ్ళు భోగిమంటలు హరిదాసు కీర్తనలు నిర్వహించారు భోగిమంట వెలిగించి సంబరాలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సీనియర్ అసిస్టెంట్ జానీ భాష హెల్త్ అసిస్టెంట్ ప్రహ్లాద్ ఏఎన్ఎం కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.