నారద వర్తమాన సమాచారం
సిరిసిల్ల జిల్లా మద్దికుంట గ్రామస్తులపై నక్క దాడి
సిరిసిల్ల :
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామంలో ఈరోజు ఉద యం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులపై నక్క దాడి చేసింది, అరణ్యంలో ఉండవలసిన క్రూర జంతు వైన నక్క అనుకోకుండా ఆహారం వెతుక్కుంటూ గ్రామంలోకి ప్రవేశించింది, జనార్యంలోకి రావడంతో మద్దికుంట గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఉదయాన్నే ఇంటి ముందు పనులు చేస్తున్న సూత్రం రాధా అనే మహిళ పై నక్క దాడి చేయగా. మహిళా తీవ్రంగా గాయపడగా.. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నక్క దాడిలో మరో ముగ్గు రికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది.
గ్రామస్తులపై దాడి చేసిన నక్కను వెంబడించి కర్రలతో కొట్టి చంపారు. గ్రామస్తులు. సంఘటన స్థలానికి చేరు కున్న అటవీశాఖ అధికారు లను అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించా లంటూ వేడుకున్నారు..