నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి — పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపీఎస్ .
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2025 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోస్టర్ ను ఆవిష్కరించిన ఎస్పీ
నరసరావుపేట DTO సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జనవరి 16 వ తేదీ నుండి ఫిబ్రవరి 15 వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు-2025. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం, విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం వాహనం నడపడం, వ్యతిరేక దిశలో ప్రయాణించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించక పోవడం, అతివేగం, U- టర్న్ తీసుకునేటప్పుడు చుట్టూ వున్న వాహనాలను గమనించక పోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు.రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బాధితులకు తగిన దైర్యం చెప్పి, క్షతగాత్రులకు త్వరితగతిన వైద్యసహాయం అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. తో పాటు సంజీవ్ కుమార్ (నరసరావు పేట DTO), శివ నాగేశ్వరరావు (నరసరావుపేట MVI) వంశీకృష్ణ (Asst.MVI), నాగేశ్వరరావు(Asst.MVI), మనిషా(Asst.MVI) పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.