నారద వర్తమాన సమాచారం
రాజకీయ చదరంగంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు బలి
ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు 679 మండలాలు,13,324 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 13324 గ్రామాలలో పనికి ఆహార పథకంలో ఎంతో మంది కూలీలు, ఫీల్డ్ అసస్టెంట్లు ఉపాధిని పొందుతున్నారు. ఈ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు బయట ఉద్యోగాలు మానేసి గ్రామంలోని ఉంటూ తాము ఉపాధి పొందవచ్చునని గ్రామాలలో ఉండి తమ వృత్తి భాద్యతలు నెరవేరుస్తున్నారు. కానీ వారు స్థానిక నాయకుల రాజకీయ చదరంగంలో బలి పశువులవుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి అనుగుణంగా వీరు నడుచుకుంటున్నా గ్రామంలోని కొన్ని వ్యక్తిగత కక్షల వల్ల వీరు సమస్యలను ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని వీరిపై ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్న వారిలో ఒకరు ఇద్దరు వ్యక్తిగత ప్రలోభాలకు లోబడి పిర్యాదులు చేస్తుండడంతో వీరి బ్రతుకులు ఆగమ్య గోచరంగా మారుతున్నాయి.వృత్తిలో సక్రమంగా విధులు నిర్వహిస్తున్న వీరిపై కొంతమంది స్థానిక నాయకులకు సంబంధించిన వారికి పనికి రాకపోయినా మస్తర్లు వేయించాలని కోరడం,కమిషన్లు ఇవ్వాలని అడగడం వీటన్నిటినీ చెయ్యలేక ఎదిరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు పై పిర్యాదులు చేయించడం చేస్తున్నారు. రాష్ట్ర శాసన సభ కూడా మెజారిటీ ప్రజలు ఏ వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి అధికారంలో ఉంటున్నారు. కానీ ఈ ఉపాధి హామీ పథకంలో కొన్ని లక్షల మంది పనిచేస్తున్న ఎవరో ఒకరు ఇద్దరు చేస్తున్న పిర్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బలి అవుతున్నారు. గ్రామాల్లో ఇదే వృత్తి బ్రతుకు తెరువుగా భావించి వారి బ్రతుకులు వెళ్లదీస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.అన్యాయాన్ని ఎదిరించే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు,పంచాయితీ రాజ్ శాఖా మాథ్యులు కొణిదల పవన్ కళ్యాణ్ తన సొంత శాఖలో జరుగుతున్న అన్యాయానికి ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలకు కచ్చితంగా న్యాయం చేస్తారని ఫీల్డ్ అసిస్టెంట్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.