నారద వర్తమాన సమాచారం
మనస్పర్థల వల్లే ఆరోపణలు :- డిఎస్పీ నాగేశ్వరరావు
నరసరావుపేట :- నరసరావుపేట పట్టణం వరవకట్టకు చెందిన జమీర్ అలియాస్ లింగా, అతని స్నేహితులు ఖాదర్, సుఖాని గంజాయి విక్రయిస్తుంటే సమాచారం అందించారనే నేపంతో మీడియా ముఖంగా జమీర్ కుటుంబ సభ్యులు షారుఖ్, ఫారుఖ్ పై ఆరోపణలు చేస్తున్నారని డిఎస్పి నాగేశ్వరరావు పేర్కొన్నారు. నరసరావుపేట ఒకటోవ పట్టణ పోలీసు స్టేషన్ లో శనివారం రాత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పాత నేరస్తుడైన జమీర్ అతని స్నేహితులు గంజాయి అమ్ముతుంటే పట్టించారన్న కారణంతో గత నెల 31 రాత్రి గొడవ పడ్డారని, ఘటనపై ఇరువురి పర్పసర కేసుల పెట్టుకోగా కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో పారుఖ్, ఫారును అరెస్టు చేసి బైండోవర్ చేశామని, జమీర్ ని అరెస్టు చేయలేదని తెలిపారు. దీంతో కేసు నుండి బయట పడాలన్నా పన్నాగంతో అన్నదమ్ములు గంజాయి విక్రయించమ బెదరిస్తున్నారని పేర్కొనడం జరిగిందన్నారు. ఈ నిందితులపై గతంలో పలు కేసులున్నాయని జమీర్ చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే ముద్దాయిలపై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో జమీర్ మూడు, ఖాదరవలీపై 8, సుబానిపై 3, వరవకట్ట బాబుపై పలు కేసులు ఉన్నాయన్నారు. షారుక్ పై 2023 ఒక్క కేసు ఉందన్నారు. ఈ రెండు కేసుల్లో మొత్తం ఆరుగురు ముద్దాయిలు ఉండారని వారిపై రౌడీషీట్లు తెరుస్తామన్నారు. వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం వల్లే ప్రతీకారం తీర్చుకునేందుకే చేసిన ప్రయత్నంలా ఉందన్నాని అన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీకే నాగేశ్వరరావు ఒకటో పట్టణ సిఐ ఎమ్ వి చరణ్ ఎస్సై అరుణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.