నారద వర్తమాన సమాచారం
విజయవాడ
విజయవాడలో ఘనంగా ఎన్ డి ఆర్ ఎఫ్ ప్రాంగణం ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
పాల్గున్న సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు.
విపత్తుల వేళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని కేంద్ర
హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనూహ్య విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు.
ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అండదండలు ఉన్నాయి.
మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తాం.
ఆరు నెలల్లో ఏపీకి రూ.3లక్షల కోట్ల విలువైన సహకారం అందించాం.
విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు ప్రకటించాం.
ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్తాం.
హడ్కో ద్వారా అమరావతికి రూ.27 వేల కోట్ల సాయం అందిస్తున్నాం.
ఏపీకి జీవనాడి అయిన పోలవరంపై సీఎం చంద్రబాబుతో చర్చించాను. 2028లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పారిస్తాం.
విశాఖ రైల్వేజోన్ ను కూడా పట్టాలెక్కించాం – అని అమిత్ షా అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.