గుర్రం జాషువా సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనమంగా జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు….
:నరసరావుపేట :నారద వర్తమాన సమాచారం
బాలికలు ఉన్నత చదువులు చదువుకుని తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం మహిళల సాధికారత అంతగా లేదని స్వాతంత్రం అనంతరం మహిళలు సాధికారత సాధించడంతోపాటు ఉన్నత చదువుల్లో కూడా రాణిస్తున్నారు అని అన్నారు. ప్రతి 1,000 మంది పురుషులకు 930 మంది మహిళలు ఉన్నారని సెక్స్ రేషియో పెంచవలసిన అవసరం ఉందన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందు ఉన్నారన్నారు. విద్యా విషయంలో ప్రధమ ర్యాంకులు సాధిస్తున్నారని కొనియాడారు. బాల్య వివాహాలను అరికట్టాలని తదనుగుణంగా తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలన్నారు. కనీసం 25 సంవత్సరంలో వయసు అప్పుడు వివాహాలు జరగాలన్నారు. బాలికలు డిగ్రీ వరకు చదువుకోవాలని అన్నారు. పదో తరగతి తదుపరి చాలామంది విద్యార్థినులు చదువు ఆపేస్తున్నారని అది సరైన విధానం కాదన్నారు. పురుషులతో సమానంగా సమానత్వం ఉండాలన్నారు. కార్యక్రమంలో శంకర భారతిపురం విద్యార్థులు జాతీయస్థాయి కోకో పోటీలకు ఎంపికైన దృష్ట్యా చంద్రిక, రంగమ్మ, సౌమ్యలకు మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కుముదిని సింగ్, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ బి .వి. రవి, డి సి టి ఓ రేవతి తదితరులు పాల్గొన్నారు…..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.