నారద వర్తమాన సమాచారం
కోటప్పకొండ తిరునాళ్లను వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చెయ్యాలని అధికారులు ఆదేశించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణబాబు ఐఏఎస్
నరసరావుపేట :-
ఫిబ్రవరి-26,2025 న జరిగే కోటప్ప కొండ తిరునాళ్లలో ఎటువంటి అవాచనీయ ఘటనలు మరియు భక్తులకు అసౌకర్యం జరుగ కుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కోటప్ప కొండ వద్ద మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భక్తులు కొండ క్రింద బస్సు ఎక్కినప్పటి నుండి దర్శనానంతరం కొండ దిగే వరకు జాగ్రత్తగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగు నీటి సమస్య తలెత్తకుండా మంచి నీటి వసతి ఏర్పాటు చేయాలని, అదేవిధముగా ఎండ తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన చోట మ్యాట్లు ఏర్పాటు చేయాలన్నారు. నడక మార్గములో తగు టెంట్లు వేయడం తోపాటు ప్రతి 100 మీటర్లకు మంచి నీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర విద్యుత్ ఉండేలా సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని, హై టెన్షన్ తీగల వలన వచ్చే ప్రభలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఘాట్ కు అనువైన బస్సులను మాత్రమె వినియోగించాలని ఆర్.టి.సి అధికారులకు సూచించారు. ఘాట్ రోడ్డుద్వారా భక్తులకు అనుమతి లేదని, మెట్ల మార్గం ద్వారా మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. చిన్న పిల్లలుకు తప్పిపోయినప్పుడు వారిని గుర్తించేలా చేతికి ట్యాగ్ లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యూ లైన్ల నిర్వహణ, గుర్తింపు చిహ్నాలు, స్వామి ప్రసాదాల విషయములో తగు ఎర్పాటుచేయాలని తెలిపారు. అవరమైన ప్రధమ చికిత్సా కేంద్రాలును ఏర్పాటు చేయాలని, 108 వాహనాలను అందుబాటులో ఉంచాలని సంబందిత అ వైధ్యాదికారికి సూచించారు. భారత స్కౌట్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. పడిన చెత్తను పడినట్లు వెంటనే ఎత్తి వేయాలన్నారు. ఈ కార్యక్రమములో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, దేవాదాయ శాఖ అదనపు కమీషనర్ చంద్ర కుమార్, రెవిన్యూ డివిజినల్ అధికారి మాధవీ లత, జిల్లా అటవీ అధికారి కృష్ణ ప్రియ, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి జిల్లా ధికారులు తదితరులు పాల్గొనారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.