నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారులతో జీవో నెంబర్ 117 గురించి రివ్యూ నిర్వహించిన కలెక్టర్ అరుణ్ బాబు ఐ ఏ ఎస్
స్కూల్ మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేయండి…
గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు గారు ఈరోజు పల్నాడు జిల్లాలోని 28 మండలాల మండల విద్యాశాఖ అధికారులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి లతో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ అనగా జీవో 117 కు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సిద్ధం చేయుట గురించి మండలాల వారీగా రివ్యూ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎదురవుతున్న పలు ప్రశ్నలకు గౌరవ కలెక్టర్ గారు సూచనలు ఇవ్వడం జరిగింది.
విద్యార్థుల సంఖ్య 60 దగ్గర్లో ఉన్న పాఠశాలను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా ప్రతిపాదించమని సూచించారు మరియు సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలను పిల్లలకి ఇబ్బంది లేకుండా యధాతధంగా కొనసాగించుటకు ఆమోదం తెలిపారు .
అదే విధంగా ప్రతి పంచాయతీని పరిశీలించి కనీసం ఒక మోడల్ పాఠశాల అయినా ఉండేటట్లుగా చూడమని అధికారులను ఆదేశించారు .
ఈ సందర్భంగా ఎక్కడ ఏ పాఠశాలలను మూసివేయడం జరగదని మరియు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు శ్రీమతి ఎల్ చంద్రకళ, ఉప విద్యాశాఖ అధికారి, అధికారులు మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.