నారద వర్తమాన సమాచారం
ఏపి ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లు బహుకరించిన నటుడు సోనూ సూద్
ఏపీ సీఎం చంద్రబాబును నటుడు, “సూద్ ఛారిటీ ఫౌండేషన్” వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు.
ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ 4 అంబులెన్స్ లను బహుకరించింది. ఈ సందర్భంగా
సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్.. ఫౌండేషన్ అంబులెన్స్ లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాలుగు అంబులెన్స్ లను సీఎం ప్రారంభించారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.