నారద వర్తమాన సమాచారం
జిల్లాలో 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
జిల్లాలో మార్చి 01 నుంచి 20వ తేదీ వరకూ 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ రాత పరీక్షలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. 17,905 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 14,529 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి మొత్తం 32,434 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారన్నారు.
వీరితో పాటూ మరో 2117 మంది విద్యార్థులు
మార్చి 03 నుంచి 15 వరకూ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారన్నారు. 9 కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక హెల్త్ అసిస్టెంట్ ను అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఏ పరీక్షా కేంద్రానికి అయినా చేరుకునే విధంగా కీలక ప్రాంతాల్లో మెడికల్ వ్యాన్లను సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ ప్రతినిథులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో మురళి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నీలావతి దేవి, డీఈవో చంద్రకళ, డీఎంహెచ్ఓ రవి, నరసరావు పేట మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.