నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆర్ముడురిజర్వ్ (ఏ.ఆర్) సిబ్బందికి 15 రోజుల పాటు యాన్యువల్ మొబలైజేషన్ శిక్షణ.
సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మొబలైజేషన్ కు హాజరు అయిన సిబ్బందితో మాట్లాడి వారికి తగు సూచనలు చేయడం జరిగింది.
యానువల్ మొబలైజేషన్ శిక్షణ అనేది ఆర్ముడు రిజర్వ్ (ఏఆర్) పోలీస్ సిబ్బందికి ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమం. ఇందులో పోలీసుల సామర్థ్యాలను మెరుగుపరచడం, ఆధునిక ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించడం, క్రమశిక్షణను బలోపేతం చేయడం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టడం మొదలైన అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడుతుంది.
బి.డి టీం, ప్రిజనర్స్ ఎస్కార్ట్, గార్డు డ్యూటీలు, డాగ్ స్క్వాడ్, పి.ఎస్.ఓలు, డ్రైవర్లు తదితర విభాగాల్లో సేవలందిస్తున్న ఏఆర్ పోలీసు సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొవడం జరిగింది.
ఈ రోజు జరిగిన శిక్షణలో జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ V. సత్తి బాబు పాల్గొని, సిబ్బందికి ఆయుధాల గురించి పూర్తి వివరాలు అందించారు. ఆయుధాన్ని సమయోచితంగా ఉపయోగించే విధానం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన మెళుకువలు, సంరక్షణ పద్ధతులు తెలియజేశారు.
మొబలైజేషన్ లో భాగంగా సిబ్బందికి అన్ని ఆయుధాలపై ప్రత్యేక శిక్షణ అందించబడింది. అదేవిధంగా ఆయుధాల నిర్మాణం, వాటి పనితీరు, శత్రువుపై దాడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది.
అలాగే కవాతు & మాబ్ కంట్రోల్ శిక్షణ ద్వారా పోలీసులు అత్యవసర పరిస్థితులలో గుంపును ఎలా నియంత్రించాలి, ప్రజా రక్షణ లో మాబ్ కంట్రోల్ టెక్నిక్స్, వ్యూహాత్మక విధానాలు వివరించబడ్డాయి.
బందోబస్తు విధులు, ముఖ్యమైన వ్యక్తుల భద్రత, ప్రిజనర్స్ ఎస్కార్ట్, గార్డు డ్యూటీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సెక్యూరిటీ ప్రోటోకాల్ గురించి వివరించడం జరుగుతుంది.
అదేవిధంగా సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు మెడిటేషన్, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు ఏ.ఆర్ డిఎస్పి మహాత్మా గాంధీ , అడ్మిన్ ఆర్.ఐ రాజా వెల్ఫేర్ ఆర్.ఐ L.గోపీనాథ్ హోంగార్డ్ ఆర్.ఐ కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.