నారద వర్తమాన సమాచారం
ఢిల్లీకి రాజుఎవరు
న్యూ ఢిల్లీ :
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది. భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. సుమారు 27 ఏళ్ల తర్వాత దేశరాజధాని ఢిల్లీలో కమలం జెండా ఎగిరింది. బీజేపీ సర్కారు గద్దెనెక్కబోతోంది.
అయితే, ఇప్పుడు సీఎం రేస్ లో ఎవరు ఉన్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది
పర్వేష్ వర్మ. ఢిల్లీ బీజేపీలో ముఖ్యమైన నేత. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ను ఓడించారు. న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 3వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. పర్వేష్ వర్మ.. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. కేజ్రీవాల్ ను ఓడించడం అనేది ఆయనకు ప్లస్ పాయింట్ గా మారుతుంది.
మాజీ ఎంపీ రమేష్ బిధూరీ. ఆయన ఆప్ సీఎం అతిషీ మీద పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఢిల్లీ రాజకీయాల్లో ఆయనకు గట్టి పట్టు ఉంది. గుజ్జర్ సామాజికవర్గాన్ని ప్రభావితం చేయగల నేత. ఓదైనా ఓపెన్ గా మాట్లాడ తారు. జనాల్లో ఉంటారనే పేరు ఉండడం ఆయనకు ప్లస్. ఓడిపోయినా సరే సీఎంను చేద్దామని బీజేపీ హైకమాండ్ భావిస్తే ఆయనకు కలిసొస్తుంది.
బన్సూరీ స్వరాజ్. ఆమె కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ మాజీ సీఎం దివంగత సుష్మా స్వరాజ్ కూతురు. ఫస్ట్ టైమ్ ఎంపీ. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సుష్మా స్వరాజ్ కూతురు అనే ప్లస్ పాయింట్ ఉండడం వల్ల ఆమె కూడా రేస్ లో ఉండొచ్చు.
కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా రేస్ లో కి వచ్చే అవకాశం ఉంది. 2014 నుంచి 2024 వరకు ఆమె కేంద్రమంత్రిగా చక్రం తిప్పారు. బీజేపీ హైకమాండ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ చేతిలో ఓడిపోయారు.
ఇక మరో లీడర్ దుష్యంత్ గౌతమ్. బీజేపీ జాతీయ కార్యదర్శి. కరోల్ బాగ్ నుంచి పోటీ చేశారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. దళితుడు. ఈ ఈక్వేషన్స్ అన్నీ కలసి వస్తే ఆయన లక్కీగా సీఎం అయ్యే అవకాశాలు లేకపోలేదు.
బీజేపీలో పేరున్న మరో ఎంపీ మనోజ్ తివారీ పేరు కూడా పరిశీలనలోకి రావొచ్చు. 2014 నుంచి ఆయన ఈశాన్య ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తున్నారు. ఆయన ఢిల్లీ బీజేపీ అధ్యక్షు డిగా ఉన్న సమయంలోనే 2017లో మున్సిపల్ కార్పొ రేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో పార్టీని విజయపధం వైపు నడిపారు.
పూర్వాంచలీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన్ను ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.