నారద వర్తమాన సమాచారం
48 గంటల మన్యం బంద్ కు సంపూర్ణ మద్దతు -సిపిఎం
చింతూరు,
రాజ్యాంగబద్ధ పదవిలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివాసి గిరిజన సంఘాలు ఈ నెల 11,12 తేదీలలో 48 గంటల రాష్ట్ర ఏజెన్సీ బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చాయి ఈ బంద్ కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ,బంద్ జయప్రదంలో భాగస్వామ్యం అవుతాం అని సిపిఎం మండల కమిటీ ప్రకటించింది. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో మండల కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జీవో నెంబర్ 3 ని పునరుద్ధరిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారని నేటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్న ఆ హామీ అమలుకు ఇంతవరకు పూనుకోలేదని అన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా, ఉన్న చట్టాలను ఎలా సవరించాలని ఆలోచించడం అత్యంత దుర్మార్గమని అన్నారు.ఎన్నికల ప్రచారంలో గిరిజన ప్రాంత జీవోలను చట్టాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు టూరిస్ట్ డెవలప్మెంట్ కోసం గిరిజనుల భూములకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించాలని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. ఇది ఆదివాసి ప్రాంత హక్కులు చట్టాలకు భంగం కలిగించడమేనని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా దానిమీద ప్రభుత్వం వైఖరి స్పష్టంగా తెలియచాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వనరులను పెట్టుబడిదారులకు ఆదాయాలుగా మలిచి ఏజెన్సీ ప్రాంతానికి, ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఆదివాసిలంతా ఐక్యంగా తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ప్రకటన చేయాలని, ఆదివాసీల హక్కులు చట్టాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ చట్టాల రక్షణ కోసం, స్పీకర్ వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 11,12న జరిగే 48 గంటల మన్యం బందుకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, బంద్ జయప్రదం లో భాగస్వామి అవుతామని ప్రకటించింది. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సీసం సురేష్,ఎర్రంశెట్టి శ్రీనివాస్, ముట్టం రాజయ్య, పోడియం లక్ష్మణ్, మల్లం సుబ్బమ్మ, మడకం చిన్నయ్య,సవలం కన్నయ్య, చింతా రాంబాబు, పట్రా రమేష్, కారం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.