నారద వర్తమాన సమాచారం
డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ పి అరుణబాబు ఐఏఎస్ ఎస్పి కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
నరసరావుపేట:
పల్నాడు జిల్లా,
10/2/ 2025: పల్నాడు జిల్లాలో, ఈరోజు కలెక్టరేట్లో “డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ” సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు యాక్సిడెంట్స్ డేటాను పరిశీలించి ప్రమాదల నివారణకు పలు సూచనలు చేశారు. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖలైనటువంటి పోలీస్, రవాణా, r&b, నేషనల్ హైవేస్ మరియు ఆరోగ్య శాఖలు సమన్వయం తో పనిచేయాలని ఆయన కోరారు. 2- వీలర్స్ నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని , ఫోన్ మాట్లాడుతు డ్రైవ్ చేసేవారి పట్ల కటినంగా వ్యవహరించాలని, 2 వీలర్స్ నడిపే వారు హెల్మెట్ దరించేల చూడాలని పోలీస్ మరియు రవాణా శాఖలను కలెక్టర్ ఆదేశించారు.రొంపిచర్ల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని NAM హై వే పై ఫ్లైఓవర్ నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ కొరారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతు యూ టర్న్స్ దగ్గర సైన్ బోర్డులు రేడియం స్టిక్కర్లు పెట్టాలి అన్నారు.అనంతరం నోడల్ అధికారి
E -DAR యాప్ పైన అవగాహన కల్పించారు..రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం పైన నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లు అందజేసారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా రవాణా శాఖ అధికారి ,ఆర్ & బి ఇ.ఇ రాజ నాయిక్, ఆర్టీసీ ఆర్ ఎం శ్రీనివాసరావు,NHAI అధికారులు మరియు రోడ్ సేఫ్టీ N.G.O. దుర్గ పద్మజ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.