నారద వర్తమాన సమాచారం
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి నరసరావుపేటలో మున్సిపల్ హై స్కూల్ నందు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ పి అరుణబాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావు..
మంగళవారం పల్నాడు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తో కలసి ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు.తొలుత నరసరావుపేట పల్నాడు బస్టాండ్ వద్ద ఉన్న స్థానిక మున్సిపల్ హైస్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి తగు సూచనలను అందజేశారు. అనంతరం సత్తెనపల్లి లోని బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం, ముప్పాళ్ళ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. తదుపరి రాజుపాలెం లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని మరియు నకరికల్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పట్టభద్రుల ఓటర్లకు ఇబ్బంది కలగకుండా క్యాంపుల ఏర్పాటు అవసరమైన నిరంతర విద్యుత్ అందించేలా మరియు మంచినీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు . పోలింగ్ సమయంలో ఓటర్లు ఎండ తీవ్రతకు గురికాకుండా ఉండే విధంగా టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారి మదు లత సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.