నారద వర్తమాన సమాచారం
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించండి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశం
సమావేశనికి హాజరైన రోడ్డు సేఫ్టీ కమిటీ పల్నాడు జిల్లా చైర్మన్ కలెక్టర్ అరుణ్ బాబు
నరసరావుపేట ,
ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారిపట్ల కఠినంగా వ్యవహారించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలు నందు సోమవారం జిల్లా స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశనికి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మరియు కమిటీ చైర్మన్ పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రమాదాలకు సంబంధించిన డేటాను పరిశీలించి వాటి నివారణకు తీసుకోవాల్సిన పలు సూచనలు చేశారు. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత శాఖాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖలైనటువంటి రెవిన్యూ, రవాణా, ఆర్ అండ్ బి మరియు నేషనల్ హైవేస్ అలాగే ఆరోగ్య శాఖలు పోలీసు శాఖను సమన్వయం చేసుకొని పనిచేయాలని కోరారు.
ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధరించేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదేవిదంగా యూ టర్న్స్ దగ్గర సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రొంపిచర్ల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని యన్ ఏ యం హైవే పై ఫ్లైఓవర్ నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ను కోరారు. అనంతరం నోడల్ అధికారి ఈ – డర్ యాప్ పైన అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంపైన నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లు అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి, ఆర్& బి ఇ.ఇ రాజ నాయక్, ఆర్టీసీ ఆర్.ఎం శ్రీనివాసరావు, యన్ హెచ్ ఏ ఐ అధికారులు మరియు రోడ్ సేఫ్టీ యన్.జి.వో దుర్గ పద్మజ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.