నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్ర పటానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు, ఐపీఎస్.,
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య జయంతి .
ఎస్పీ మాట్లాడుతూ సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14 న కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో సాధారణ మైన ఒక దళిత కుటుంబంలో జన్మించి కర్నూలు, అనంతపురంలో కూడా విద్యాభ్యాసాన్ని అభ్యసించడం జరిగిందన్నారు .
ఒక చిన్న గుమస్తా ఉద్యోగం నుండి ప్రారంభమైన జీవితం మంచి విద్యావంతుడుగా గొప్ప వ్యక్తిగా అంచలంచెలుగా ఎదుగుతూ రాజకీయం వైపు మనసు మళ్లించి ఆంధ్రప్రదేశ్ రెండవ, తొలి దళిత ముఖ్యమంత్రి అయ్యారన్నారు.
సంయుక్త మద్రాసు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అనేకసార్లు ఆయన మంత్రి పదవులను నిర్వహించారు. రెండుసార్లు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా పనిచేయడం ఈయన ప్రత్యేకత. 38 ఏళ్ల చిన్నవయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత దామోదర సంజీవయ్యకే దక్కిందన్నారు.
1967లో ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా రోడ్డు ప్రమాదం గురి అయ్యారు. తరువాత1972 గుండెపోటుతో మరణించారు
ఇలాంటి గొప్ప మహనీయుల సేవలను మనమందరం స్మరించుకోవాలి అని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పి(అడ్మిన్) J.V సంతోష్ అదనపు ఎస్పీ ఏ.ఆర్ V. సత్తి బాబు ఏ.ఆర్ డి.ఎస్.పి మహాత్మా గాంధీ రెడ్డి ,హోమ్ గార్డ్ ఆర్ ఐ కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.