నారద వర్తమాన సమాచారం
రెవిన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను శనివారంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలు పెండింగి లో లేకుండా శనివారం(22/02/2025) సాయంత్రానికి కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ బాబు సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యలయములోని గుర్రం జాషువా సమావేశ మందిరములో మండల రేవిన్యూ అధికారులు మరియు సర్వేయర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో , డివిజన్ స్థాయిలో ప్రతి సోమవారం వచ్చే ఆర్జీలను తప్పని సరిగా వంద శాతం ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.వచ్చిన ప్రతి అర్జీని దేని కి దానికి వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. ఏవి కూడా బియాండ్ యస్.ఎల్.ఎ కి పోకుండా చూడలన్నారు. రెవిన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ప్రధానంగా ఫ్రీ హోల్డ్ హౌసేసే, పజా పిర్యాదుల పరిష్కారం, ఐ.వి.ఆర్.యస్ మరియు జి.ఓ నెం: 30 ని అనుసరించి రెగ్యులరైజేషన్ పై సమీక్షించి పలు సూచనలు చేసారు. అవసరమైన పిర్యాదులకు వంద శాతం నోటీసులు ఇవ్వాలని, వంద శాతం అదనపు చార్జీలు వసూలు చేయరాదని ఆయన తెలిపారు. మండల రెవిన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు పరస్పర సహకారములతో సంబందిత సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమములో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవిన్యూ అధికారి మురళి, రెవిన్యూ డివిజినల అధికారులు మధు లత, రమాకాంత్ రెడ్డి, మురళి కృష్ణ ,తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.