36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ముగింపు కార్యక్రమం
నారద వర్తమాన సమాచారం
తేది.15-02-2025 న, శనివారం నాడు 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా సుమారు 200 మంది ద్విచక్ర వాహన చోదకులకు శిరస్త్రాణం హెల్మెట్ ధరించడం మరియు ప్రాణములను కాపాడుకోవాల్సిందే అనే నిదానంతో నరసరావుపేట పట్టణ విధుల్లో ర్యాలీగా వాహనములు నడుపుచు ప్రదర్శించారు.
ఈ ముగింపు కార్యక్రమమును పట్టణ డిఎస్పి శ్రీ కె నాగేశ్వరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి వారు కూడా పట్టణ వీధుల్లో శిరస్త్రాణం ధరించి ద్విచక్ర వాహనంపై సంచారించారు.
ఈ ర్యాలీ పట్టణంలో ఉన్న ద్విచక్ర వాహనాల డీలర్లు, ఈశ్వర్ కాలేజ్ విద్యార్థులు, ఎన్ ఇ సి కాలేజ్ నెహ్రు యువ కేంద్ర వాలంటీర్లు తో పాటు రవాణా శాఖ యొక్క జిల్లా రవాణా శాఖ అధికారి జి సంజీవ్ కుమార్ మరియు జిల్లాలోని వాహన తనిఖీ అధికారులు ఎన్ శివ నాగేశ్వరావు సిహెచ్ రాంబాబు కేఎల్ రావు , డి శేషు రెడ్డి, సిహెచ్ మనీషా, వంశీకృష్ణ, పోలీస్ తరఫున టౌన్ ట్రాఫిక్ సీఐ లోకనాథం మరియు ఎస్ ఐ వేణు సిబ్బంది పాల్గొని దీని విజయవంతం చేశారు.
రోడ్ సేఫ్టీ డాక్టర్ నవ్య రోడ్ సేఫ్టీ ఆర్ అండ్ బి డి హజరత్ అయ్యగారు మరియు నరసరావుపేట ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా ఈ ముగింపు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.