నారద వర్తమాన సమాచారం
తుది దశకు గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్
▪️ రేపే యూనియన్లతో ప్రభుత్వం కీలక భేటీ.
▪️ ప్రమోషన్ ఛానెల్ పై స్పష్టత కోరనున్న ఉద్యోగ సంఘాలు
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియలో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సచివాలయాల శాఖకు సంబంధించిన నూటికి నూరు శాతం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తరపున ఆ శాఖ మంత్రి డోలాబాలవీరాంజనేయ స్వామి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధి కారులు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఉద్యోగ సంఘాలతో కీలక సమావేశం కావడంతో ఆయా సంఘాల సభ్యుల నుంచి, క్షేత్రస్థాయిలో రేషనలైజేషన్ ప్రక్రియలో ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది? అనే అంశాలపై ఉద్యోగ సంఘాలు దృష్టి సారించాయి. రేషనలైజేషన్ గురించి ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీస్ కార్యదర్శుల సేవలు, ఇంజినీరింగ్ శాఖల్లో, వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను సాంఘిక సంక్షేమం, వెనుకబడిన, గిరిజన సంక్షేమ శాఖల్లో వినియోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీల యూనియన్ కూడా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకురానున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా హేతుబద్ధీకరణ కన్నా ముందుగానే జిల్లాల వారీ సీనియారిటీ జాబితాలను రూపొందించి ప్రమోషన్ కల్పించాలని, GSWS లో ఇంతవరకు ప్రమోషన్ కల్పించిన విఎఎ, ఎహెచ్ఎ, విఎస్ఎ, ఎఎన్ఎమ్ లాగా తమకు కూడా సీనియర్ అసిస్టెంట్ పేస్కేలు సమానమైన హోదాలో ప్రమోషన్ ఛానెల్ కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించనున్నట్లు తెలిసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.