నారద వర్తమాన సమాచారం
56,964 మంది పట్టభద్రుల ఓటు హక్కు పొందారు : పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఐఏఎస్
నరసరావుపేట ,
ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 37,831 మంది పురుష ఓటర్లు, 19,139 మహిళా ఓటర్లు కలిపి మొత్తం 56,964 మంది పట్టభద్రులు ఓటు హక్కు పొందారని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికలపై పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలో 90 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ నిర్వహించేందుకు రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 503 మందిని ఎంపిక చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 293 మంది పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
పోలింగ్ నిర్వహించే సిబ్బందికి సోమవారం తొలి శిక్షణ కార్యక్రమం నిర్వహించామని, ఫిబ్రవరి 22 న మరోసారి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. పోలింగ్ కోసం డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా ఎస్.ఎస్.ఎన్ కళాశాలను ఎంపిక చేశామన్నారు.
ఫిబ్రవరి 22 నాటికి కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 26న నిర్వహించనున్న కోటప్పకొండ తిరునాళ్ల కోసం ఏర్పాట్లను ఫిబ్రవరి 22 లోగా పూర్తి చేయనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. శివరాత్రి మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండబోతున్నందున నరసరావుపేట పట్టణంలో పోలింగ్ పూర్తయ్యే వరకూ ప్రభల తిరుగు ప్రయాణానికి అంక్షలుంటాయన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.