నారద వర్తమాన సమాచారం
అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకుంటే రాజీనామా చేయండి – వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదని విమర్శిస్తూ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
“ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత నిర్వర్తించాలి!”
షర్మిల ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాట్లాడుతూ, “ఈ సారి అయినా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని” వైసీపీని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని ఆరోపిస్తూ, “ప్రతీ హామీకి 90 కారణాలు చెబుతున్నారు, కానీ అమలు మాత్రం లేదు” అని ఆమె విమర్శించారు.
“సూపర్ సిక్స్ కోసం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి!”
ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాల కోసం పూర్తిస్థాయి నిధులు కేటాయించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
“జగన్‌కు ప్రజల సమస్యలు పట్టవా?”
షర్మిల మరోసారి తన అన్న, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఘాటుగా స్పందించారు. “నేరస్థులను పరామర్శించేందుకు సమయం ఉంది, కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీయడానికి మాత్రం మొహం చెల్లదు” అంటూ జగన్‌పై విమర్శలు చేశారు.
“ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీలో లేకపోవడం సరికాదు!”
“ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మౌనం పాటిస్తున్న వైసీపీ నేతలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదని” షర్మిల ఫైర్ అయ్యారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.