Wednesday, July 2, 2025

గ్రేటర్ గుంటూరులో కలిసే గ్రామాలు ఇవే..

నారద వర్తమాన సమాచారం

గ్రేటర్ గుంటూరులో కలిసే గ్రామాలు ఇవే..

మేడికొండూరు: పేరేచర్ల, డోకిపర్రు..

ఫిరంగిపురం: అమీనాబాద్..

చేబ్రోలు: నారాకోడూరు, గొడవర్రు, గుండవరం..

ప్రత్తిపాడు: చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదుల పాలెం..

తాడికొండ: లాం, కంతేరు, దామరపల్లి, గరికపాడు, పొన్నెకల్లు..

వట్టిచెరుకూరు: పుల్లడిగుంట, కొర్నేపాడు, వింజనంపాడు, కుర్నూతల..

పెద్దకాకాని: రామచంద్రపాలెం, నంబూరు, అగతవరప్పాడు, గోళ్లమూడి, కొప్పురావూరు, పెద్దకాకాని, వెలిగండ్ల, వెంకట కృష్ణాపురం..

గుంటూరు: చిన్న పలకలూరు, మల్లవరం, గోర్లవారిపాలెం, జొన్నలగడ్డ, చల్లావారిపాలెం, తురకపాలెం, తోకావారిపాలెం, లాల్ పురం, వెంగళాయపాలెం, దాసుపాలెం, ఓబులు నాయుడుపాలెం..

“గుంటూరు గ్రామం మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు అవుతుంది..

ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రేటర్ గుంటూరు గా రూపాంతరం చెందనున్నది..

ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్ లో ఎనిమిది మండలాల పరిధిలోని 39 గ్రామాలను విలీనం అవ్వనున్నాయి..

గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగవనున్నది..

ఈ మేరకు సీఎం చంద్రబాబు నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది..

ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవి కాలం పూర్తి అయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలుపుతారు..

ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం..”

కార్పొరేషన్ పరిధిలో 39 గ్రామాలు

8 మండలాలు గుంటూరు పరిధిలోకి

రద్దు అవనున్న రూరల్ మండలం

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

విజయవాడతో పాటు గుంటూరు పై దృష్టి _*జంట నగరాలు*_

నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు – విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి..

ఇప్పటికే స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం రూ:2 వేల కోట్లు మంజూరు చేసింది..

హైదరాబాద్ కు దీటుగా జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది..


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading