నారద వర్తమాన సమాచారం
నరసరావుపేటలో పలు ఆయిల్ రీ ప్యాకింగ్ యూనిట్ లను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
నరసరావుపేట:-
తేదీ 22. 02.2025 న కమీషనర్ అఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు, జాయింట్ ఫుడ్ కంట్రోలర్ యన్.పూర్ణ చంద్ర రావు, ఆధ్వర్యంలో 8 (ఎనిమిది) మంది ఫుడ్ సేఫ్టీ అధికారులచే ఎనిమిది విభాగాలుగా చేసి ఏకకాలం లో
నరసరావుపేట లో గల ఆయిల్ రీప్యాకింగ్ యూనిట్ ల మీద దాడులు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా యన్ . పూర్ణ చంద్ర రావు మాట్లాడుతూ నరససరావుపేట లో యథేచ్చగా నూనె కల్తీలు జరుగుచున్నవి అని సామాజిక మాధ్యమాలలో మరియు న్యూస్ పేపర్ లో వచ్చిన కథనాల మేరకు, ఈ దాడులు నిర్వహించడం జరిగినది అందులో భాగంగా నాలుగు- (4) రైస్ బ్రాన్ ఆయిల్ మరియు, రెండు- (2) సన్ ఫ్లవర్ ఆయిల్ లు, మూడు (3) గ్రౌండ్ నాట్ ఆయిల్, మరియు ఒకటి (1) పామోలిన్ ఆయిల్ శ్యాంపిల్స్ తీయడం జరిగినది వాటిని పరిక్షకు నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ, నాచారం. హైదరాబాద్ కు పంపడం జరుగుతుంది. పరీక్షల అనంతరం ల్యాబ్ రిపోర్ట్ లు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006, ప్రకారం నాణ్యత లోపం ఉన్నచో, వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ఆకస్మిక దాడులు నిరంతరం నిర్వహిస్తాము అని ఎల్లవేళలా ఆయిల్ రీప్యాకింగ్ యూనిట్స్ మీద నిఘా ఉంచడం జరుగుచున్నది అని తెలిపారు. అలాగే రీప్యాకింగ్ యూనిట్స్ లో గల ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్ లు శుభ్రంగా లేని యూనిట్స్ కు ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇవ్వడం జరిగినది. ఆయిల్ రీప్యాకింగ్ లో కల్తీలు జరిగితే ఉపేక్షించేది లేదని జాయింట్ ఫుడ్ కంట్రోలర్, యన్.పూర్ణ చంద్రరావు తెలియచేయడం జరిగినది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.