నారద వర్తమాన సమాచారం
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వివేకా పీఏ కృష్ణారెడ్డి ఊచలు లెక్కబెట్టనున్నాడా? అప్రూవర్ అయ్యి తన మీద ఒత్తిడి తెచ్చిన సంధింటి అబ్బాయి గురించి చెప్పబోతున్నాడా?
వైఎస్ వివేకా హత్య కేసులో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. గత జగన్ ప్రభుత్వ హయాంలో, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పైనా కేసు నమోదు చేశారు.
అయితే, పోలీసులు ఆ ముగ్గురిపై పెట్టినవి తప్పుడు కేసులని తేల్చారు.
కుట్రపూరితంగా కేసు పెట్టిన నాటి పోలీసులపై పులివెందుల మేజిస్ట్రేట్ కు నివేదిక సమర్పించారు.
వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై లోతైన దర్యాప్తు జరిపిన పోలీసులు, అది ఫేక్ కంప్లైంట్ అని తేల్చారు. కృష్ణారెడ్డికి నోటీసులు అందించారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే 2023 లో సునీత, రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్సీ రాంసింగ్ పై కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద 2023 డిసెంబర్ 15న కేసులు నమోదయ్యాయి. రాంసింగ్ తనను తీవ్రంగా కొట్టారని ఫిర్యాదు చేసిన కృష్ణారెడ్డి, అప్పట్లో వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు.
పులివెందుల కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించిన నాటి పోలీసులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ విచారణ చేపట్టారు. నాలుగు నెలలుగా దర్యాప్తు చేసి పలువురి వాంగ్మూలం సేకరించారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుతో సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్ లపై అక్రమంగా కేసు పెట్టారని పోలీసులు నిర్ధారించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.