నారద వర్తమాన సమాచారం
పెద్దకాకాని లో శాస్త్రోక్తమ్ గా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు
పెదకాకాని
పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవస్ధానములో ఆదివారము మహాశివరాత్రి బ్రహ్మోత్సవముల మొదటి రోజు శ్రీ భ్రమరాంబ అమ్మవారు పెండ్లి కుమార్తె అలంకారములో భక్తులు దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవములలో భాగముగా ఆదివారము ఉదయం గం.5.00 లకు సుప్రభాత సేవ, పంచహారతులు గం.8.00 లకు స్వామి వారికి మహన్యాసపూరీర్వక ఏకాథ రుద్రాభిషేకం, సాయంత్రం గం.4.00 లకు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనము, పంచగవ్యప్రాశన, దీక్షధారణ, త్రిశూలపూజ, అంకురారోపణ, వాస్తుపూజ, శైవాగ్ని ప్రతిష్ఠాపన జరుగునని రాత్రి గం.10.30 లకు ధ్వజారోహణ, ఆలయ బలిహరణ, సంతానముద్దలు పెట్టు కార్యక్రమములు శైవాగమ పద్ధతిన దేవస్ధాన స్ధానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకస్వామి పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు పర్యవేక్షణలో వేదపండితులు, అర్చకస్వాములచే నిర్వహించినట్లు ఆలయ ఉపకమీషనరు గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఆలయ ఉపకమీషనరు గోగినేని లీలాకుమార్ ఆదివారము జరిగిన అంకురారోపణ తదితర పూజలలో పాల్గొన్నారు. ఆదివారం ఉభయదాతలుగా పెదకాకాని గ్రామానికి చెందిన బోయపాటి రమణ ధనలక్ష్మీ దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాఘ ఆదివారము సంధర్బముగా ఆలయము భక్తులతో కిటకిటలాడినది. భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పొంగళ్ళు వండుకొని శ్రీ స్వామి వారికి నివేదిన చేసుకున్నారు. మేళతాళముల నడుమ ప్రభలతో ఆలయమునకు విచ్చేసి మ్రొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు శ్రీ స్వామి వారి దర్శనము తర్వితగతిన అగు విధముగా దేవస్ధాన అధికారులు తగు ఏర్పాట్లు చేసినారు.
సాంస్కృతిక కార్యక్రమములలో భాగముగా ఆదివారము సాయంకాలము గం.6.00 భవానీ భక్త సమాజము, పెదకాకాని వారిచే భజన కాలక్షేపము, రాత్రి గం.7.00లకు శ్రీమతి యమ్. ప్రణతి, విజయవాడ వారిచే కూచిపూడి నృత్యము, రాత్రి గం.9.00 శ్రీ శివశక్తి నాట్యమండలి, పెద్దపల్లి వారిచే శ్రీ వల్లీ కళ్యాణం పూర్తి నాటకం తదితర సాంస్కృతిక కార్యక్రమములు భక్తులను రంజింప చేసినవి.
శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత ప్రసాదము అందజేత
ఆలయము ఉదయం గం.6.00 నుండి మధ్యాహ్నం ఆలయము మూయు వరకు తిరిగి సాయంత్రం గం.4.00 నుండి రాత్రి ఆలయము మూయు వరకు ఆలయ ప్రాంగణములో ఉచిత ప్రసాదమును భక్తులందరికి అందజేయవలెనని ఉద్దేశ్యముతో ఆలయ ప్రాకర మండపములో ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన క్యూలైను ద్వారా ఆదివారము నుండి ఉచిత ప్రసాదము వితరణను ప్రారంభించినట్లు ఆలయ ఉపకమీషనరు గోగినేని లీలాకుమార్ తెలిపారు.
మహాశివరాత్రి పర్వదినమున వికలాంగులకు, వృద్ధులకు మరియు చంటి పిల్లల తల్లులకు
ఉచితముగా వాహనము ద్వారా శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాటు.
మహాశివరాత్రి పర్వదినమున శ్రీ స్వామి వారి దర్శనార్ధము విచ్చేయు వృద్దులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లులకు దేవస్ధానము వారు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్తలము (యాగంటి అపార్ట్‌మెంట్) వద్ద నుండి ఆలయము వరకు ఉచితముగా వాహన సర్వీసును దేవస్ధానము వారు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఉపకమీషనరు తెలిపారు. కావున భక్తులు సదరు విషయము గమనించి దేవస్ధాన వాహనములను వినియోగించుకొనవలసినదిగా తెలిపారు. బ్రహ్మోత్సవముల 2వ రోజు సోమవారము శ్రీ భ్రమరాంబ అమ్మవారు శ్రీ వనదుర్గాదేవి అలంకారముగా దర్శనమిస్తారని తెలిపారు. గురువారము సాయంకాలము గం.6.03లకు నరనంది వాహనముపై గ్రామోత్సవము అత్యంత వైభోపేతముగా జరుగునని కావున భక్తులు అధిక సంఖ్యలో శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకొనవలసినదిగా ఆలయ ఉపకమీషనరు గోగినేని లీలాకుమార్ భక్తులకు విజ్ఞప్తి చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.