నారద వర్తమాన సమాచారం
కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి యూపీ వెళ్లిన ఏపీ బృందం
ఆంధ్రప్రదేశ్ 2027లో రాష్ట్రంలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళాలో రాష్ట్ర బృందం అధ్యయనం చేస్తోంది. మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి కమిషనర్ కేతన్ గార్గ్ సహా పలువురు కుంభమేళాను సందర్శించారు. ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ క్లియరెన్స్, భద్రతా చర్యల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.