నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా నరసరావుపేట
ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ & రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా యూనియన్ సభ్యులకు కోటప్పకొండ మీడియా పాసులు అందజేయడంలో మొండిచేయి చూపించిన పల్నాడు జిల్లా డీ ఎస్పీ కార్యాలయం సిబ్బంది
కార్మిక శాఖ రిజిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా సభ్యులకు డ్యూటీ పాసులు జారీ చేయడంలో పల్నాడు జిల్లా డీఎస్పీ కార్యాలయం వారు పక్షపాత ధోరణితో వ్యవహరించి, ఉదయం నుంచి సాయంత్రం వరకు యూనియన్ సభ్యులను డి.ఎస్.పి. కార్యాలయ ప్రాంగణంలో పడిగాపులు కాయించి, పాసుల మీద స్టాంపులు వేస్తున్నారు, మధ్యాహ్నం రండి, 3 గంటలకు రండి ఇస్తాము అని చివరికి కేవలం కారు పాస్ లు ఇచ్చి చేతులు దులుపుకొని
మొండి చేయి చూపించారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్ లో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు వారి డ్యూటీ నిమిత్తం పాసులు జారీ చేయడంలో పక్షపాత వైఖరి చూపించడం వల్ల కోటప్పకొండ తిరునాళ్ల మీడియా కవరేజ్ కి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి మీడియా వారికి అధిక పాసులు ఇచ్చామని చెబుతున్న డిఎస్పి ఆఫీసు వారు ఏ యూనియన్ వారికి ఎన్ని పాసులు ఇచ్చారో బహిర్గతం చేయవలసిందిగా ఏపీ ఇ ఆర్ యు యూనియన్ సభ్యులు కోరుతున్నారు.
డి.ఎస్.పి ఆఫీస్ వారు నిజంగా మీడియా ప్రతినిధులకి ఇచ్చుంటే ఎవరికి ఇచ్చారు? ఎన్ని ఇచ్చారు? అవి ఎవరు ఎవరికి పంచారు? ఏమైపోయినాయ్?
మిగతా యూనియన్లతో పాటుగా ఏ.పీ.ఈ.ఆర్.యు సభ్యులు కూడా పాసులు కోరుతూ వారి సభ్యులతో కూడిన యూనియన్ లెటర్ హెడ్ ను డీఎస్పీ ఆఫీసులో అందజేశారు. కాని పాసులు మాత్రం అందలేదు. ఈ సందర్బంగా ఏ.పి.ఈ.ఆర్.యు. పల్నాడు జిల్లా నాయకులు మాట్లాడుతూ, అన్నీ యూనియన్ల సభ్యులను సమాన దృష్టితో చూడాలని, ఏ యూనియన్ కా యూనియన్ వారికి విడివిడిగా పాస్ లు ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని, భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా అన్ని యూనియన్లను సమాన దృష్టితో చూస్తూ, సమాన ప్రతినిధ్యం కల్పించాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.