నారద వర్తమాన సమాచారం
కోటప్పకొండ తిరుణాళ్ళలో తెలుగుదేశం పార్టీ అరాచకాలపై నిప్పులు నిప్పులు చెరిగిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి !
తిరుణాళ్ళ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వర్గీయులు చేసిన అరాచకాలపై తక్షణ విచారణకు డిమాండ్
తిరుణాళ్ళ ఏర్పాట్లలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది!
పట్టణ ప్రముఖులకు, మీడియాకు సైతం అందని విఐపి పాసులు !
తిరుణాళ్ళ లో జైంట్ వీల్ పార్కుఏర్పాటు లో తెలుగుదేశం నాయకుల చేతివాటం!
కొండపైన భక్తుల ఉచిత అన్నదానానికి అనుమతి నిరాకరణ దారుణమైన విషయం!
అధికారం వచ్చి తొమ్మిది నెలలైనా కోటప్పకొండ అభివృద్ధి శూన్యం!
ఈనెల 26వ తేదీన జరిగిన కోటప్పకొండ తిరునాళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిపై తెలుగుదేశం పార్టీ వర్గీయుల అరాచకాలు పతాక స్థాయికి చేరాయని, 200 సంవత్సరాల కోటప్పకొండ తిరుణాళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని అరాచక సాంప్రదాయాలకు తెలుగుదేశం పార్టీ తెరతీసిందని, ఈ తిరుణాళ్ళ లో ఎన్నో సంవత్సరాలుగా, ఏ పార్టీకి చెందిన వారైనా ప్రభలు కట్టుకోవచ్చు, ఎవరికి ఇష్టమైన పాటలు వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేవలం తమ పార్టీ వాళ్లే ప్రభలు కట్టాలని, తమ పార్టీకి చెందిన పాటలు మాత్రమే డిజెలలో వేయాలని ఆంక్షలు పెట్టడం మంచి సాంప్రదాయం కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇటువంటి తప్పుడు సాంప్రదాయాలను ప్రజలందరూ తీవ్రంగా పరిగణించాలని, ఈ తిరుణాళ్ళ లో గోనెపూడి గ్రామానికి చెందిన ఒక ప్రభ వైఎస్ఆర్ పార్టీకి చెందినదని, ఈ ప్రభ వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతిపరులు, అభిమానులు వచ్చి డీజేలో పాటలకుఆ నృత్యాలు చేశారని, ఆ సమయంలో సుమారు 200 నుంచి 300 మంది దాకా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు గోనపూడి ప్రభకు చెందిన డీజే ను, లారీను ధ్వంసం చేయటం జరిగిందని, ఆ సమయంలో అక్కడ సుమారు 50 మంది ఉన్నారని, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను ఆపలేదని, పైగా గోనపూడి గ్రామప్రభను వెనక్కు తీసుకు తీసుకువెళ్లాలని బెదిరించారని ,ఇది చాలా బాధాకరమైన విషయం అని, మీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇతర పార్టీల వాళ్ళు ప్రభలు కట్ట కూడదా? ఇదెక్కడి సాంప్రదాయమ ని ప్రశ్నించారు?
2019 నుంచి 24 వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా మేము తెలుగుదేశం పార్టీకి చెందినవారు గానీ ,ఇతర పార్టీల వారు గాని ప్రభలు కట్ట కూడదని మేము మాట్లాడామా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి సాంప్రదాయం లేదని, ప్రజలందరూఒక్కసారి ఆలోచన చేయాలని, కొత్తగా ఇటువంటి చెడు సాంప్రదాయాలకు తెలుగుదేశం పార్టీ తెరతీసిందని,
అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదని ,ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉన్నది, రేపు ఇంకొక పార్టీ రావచ్చు, అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచన చేయాలని, గోనె పూడి ప్రభ దాడి ఘటనలో నరసరావుపేటకు చెందిన వారితో పాటు కావూరు ,పురుషోత్త పట్నం, కమ్మవారి పాలెం గ్రామాలకు చెందిన వారు కూడా ఉన్నారని, తొందరలోనే వారి పేర్లు సైతం చెబుతామని భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు సాంప్రదాయాలకు
తెర దించాలని ప్రతి ఒక్కరు ఇటువంటి దాడులను ఖండించాలని తెలియజేస్తూ…
అరవపల్లి గ్రామంలో పులుసు కోటేశ్వరరావు , పులుసు రాంబాబు అనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిపై తిరుణాళ్ళ సందర్భంగా జనసేన, టిడిపి పార్టీ వారు దాడులు చేయడం అమానుషమైన చర్యని, అరవపల్లి గ్రామంలో డీజే తీసుకొని పై వారి ఇళ్ల మీదుగా వెళుతూ పులుసు కోటేశ్వరరావు మరియు రాంబాబు ఇళ్ళ వద్ద గంటల తరబడి రచ్చ రచ్చ చేస్తుంటే, ఆడవాళ్లు వచ్చి ముందుకు వెళ్ళండి అయ్యా అని చెప్తే ,ఆ చెప్పిన రాంబాబు భార్యను ఆమె కూతుర్ని ఆడవాళ్ళని సైతం చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారని ,అడ్డొచ్చిన రాంబాబు ను సైతం దారుణంగా కొట్టారని ఆయన ముక్కు కు కూడా దెబ్బ తగిలిందని ,ఆయన ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారని ,పోలీసు వారు కూడా స్టేట్మెంట్ తీసుకున్నారని, తప్పనిసరిగా ఈ కేసును రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను ,
కోటప్పకొండ తిరుణాళ్ళ లో మొదటి నుంచి కూడా భక్తులు అనేక కష్టాలు పడ్డారని పట్టపగలే మధ్యాహ్నం ఒంటిగంట దగ్గర నుంచే పెట్లూరి వారి పాలెం వద్ద ట్రాఫిక్ జామ్ అయిందని,
ఈ ట్రాఫిక్ జామ్ సమస్యకు త్రికోటేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి కూడా బలయ్యారని, ఈ ట్రాఫిక్ జామ్ కష్టాలు మంత్రి కి సైతం తప్ప లేదని, సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ లో మంత్రిగారు ఇరుక్కున్నార ని ,
ఈ తిరుణాళ్ళ లో ఆర్టీసీ సంస్థ పూర్తిగా విఫలం చెందిందని, కొండపై నుంచి కిందికి రావడానికి బస్సులు లేక భక్తులు నడిచి కొండ దిగి రావాల్సిన పరిస్థితి నెలకొందని, నరసరావుపేట బస్టాండ్ లో బస్సుల కోసం భక్తులు సుమారు మూడు గంటలపాటు వేచి ఉండాల్సిన దుస్థితి వచ్చిందని ,
అధికారులు మరియు ప్రజాప్రతినిధులు మధ్య అసలు సమన్వయమే లేదని , వీరి మధ్య సమన్వయం పూర్తిగా కొరవడిందని ,ఇక వీఐపీ పాసులు విషయానికి వస్తే 13 వేలపాసులు జారీ చేస్తే, 26 వేల పాసులు దాకా వచ్చాయని దీనివల్ల కొండపైన తొక్కేసలాట జరిగిందని, అసలు వీరు ప్రింట్ చేసిన విఐపి పాసులు ఎవరికి ఇచ్చారో తెలియలేదని, 25వ తేదీ రాత్రి వరకు పాసులు ఎక్కడ ఇస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని, ఎమ్మెల్యే ఇస్తారా, ఎమ్మెల్యే ఆఫీసులో ఇస్తారా , ఎమ్మెల్యే ఇంటికి వద్ద ఇస్తారా ,డి.ఎస్.పి ఇస్తారా ,ఎస్పీ ఇస్తారా ,ఎవరు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని,మేము అధికారంలో ఉన్నప్పుడు విఐపి పాసులు కవర్లలో పెట్టి ఇళ్లకు పంపించామని,
ప్రస్తుత తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టణంలోని ప్రముఖులకు మరియు మీడియా ప్రతినిధులకు సైతం పాసులు ఇవ్వలేని దుర్భర పరిస్థితిలో తిరణాళ్ళ నడిపారని ,
కొండపైన మధ్యాహ్నం నుంచి ఎక్కడ వాటర్ బాటిల్స్ భక్తులకు అందలేదని, కేవలం నాలుగు సిన్టెక్స్ ట్యాంకుల్లో ఉన్న నీళ్లే భక్తులకు దిక్కయ్యాయని, పాలు, బిస్కెట్లు లేక పసిపిల్లలు ఇబ్బంది పడ్డారని, ఈ ప్రభుత్వం తిరణాళ్ళ ఏర్పాట్లు సక్రమంగా చేయటంలోపూర్తి వైఫల్యం చెందిందని ,
ఇక కోటప్పకొండ తిరుణాలలో పిల్లల వినోదం కొరకు ఏర్పాటు చేసే జైంట్ వీల్ స్థలాలను గతంలో పొలాల యజమానులు తక్కువ అద్దెకు ఇచ్చేవారని ,ఇప్పుడు ఆ స్థలాలపై టిడిపి నాయకులు పెత్తనం తీసుకొని, వారే లీజు కు ఇచ్చారని ఈ లీజు వ్యవహారంలో సుమారు 8 లక్షల రూపాయలు తెలుగుదేశం నాయకులు కాజేశారని ,అదే పొలం యజమానులు డైరెక్ట్ గా జెయింట్ వీల్ వారికి లీజుకి ఇస్తే కేవలం 3 లక్షలు మాత్రమే తీసుకుంటారని, ఈ పొలాలను స్వాధీనం చేసుకున్న తెలుగుదేశం నాయకులు మాత్రం 11 లక్షలు వారి వద్ద నుంచి తీసుకున్నారని, ఇది అత్యంత దారుణమైన విషయం అని ,
అదేవిధంగా కోటప్పకొండ లో వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి చేయలేదని తెలుగుదేశం పార్టీ వారు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఇది సిగ్గుచేటైన విషయం అని, 9 నెలల్లో కొండపై ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయటం చేతకాని ఈ ప్రభుత్వం మా మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? అని కోటప్పకొండ దేవస్థానంలో సుమారు రెండు కోట్ల వరకు నిధులు ఉన్నప్పటికీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం చేతకాని తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం తగదని,
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వ హయాంలో సుమారు 17 కోట్ల రూపాయలతో ఎలమంద రోడ్డు ఎలమంద దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని ,అదేవిధంగా మూడు ఆల్టర్నేటివ్ రోడ్లు ఏర్పాటు చేశామని, కాల్వకట్ట దగ్గర 90 లక్షలు ఖర్చుపెట్టి తారు రోడ్డు వేయడం జరిగిందని ,ఆల్టర్నేటివ్ రూటు ఏర్పాటు చేశామని, నాలుగున్నర కోట్ల రూపాయలతో జేఎన్టీయూ రోడ్డు వేయడం జరిగిందని, ఈ రోడ్డు భక్తులు తిరుగు ప్రయాణానికి ఎంతో సౌకర్యం గా ఉందని ,ఈటి రోడ్డు -ఎక్కలవారిపాలెం -యాదవ సత్రం రోడ్డును కోటి రూపాయలతో నిర్మించడం జరిగిందని ,శివ కుటుంబం కట్టామని ,సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు చేయటం జరిగిందని, నందీశ్వరుడు మరియు దక్షిణామూర్తి విగ్రహాలు మా హాయంలోనే ఏర్పాటు చేశామని ,ఘాట్ రోడ్డులో ఆర్చి నిర్మాణం చేశామని ,టెంపుల్ పైన షెడ్లు వేశామని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ,ఇవన్నీ అబద్ధాలా? అని తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నించారు!
ఈరోజు మా ప్రభుత్వ హయాంలో డబుల్ రోడ్లు, బ్రిడ్జిలు వేయబట్టే ప్రభలు బ్రహ్మాండంగా వెళుతున్నా యని ,దానికి మేము చేసిన అభివృద్ధి మాత్రమే కారణమని, ఇంకా కొండపైన భక్తుల కు చిలకలూరిపేటకు చెందిన తేళ్ల సుధీర్ మరియు శ్రీధర్ అనే వ్యక్తులు గత మూడు సంవత్సరాల నుండి 20,000 మంది భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారని, ఇటువంటి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా నిలిపివేశారని ,ఎంతో కష్టపడి భక్తులు లక్షల మంది కొండమీదికి వస్తారని ,వారి సొంత ఖర్చులతో ఉచితంగా అన్నదానం చేస్తామంటే అనుమతి ఇవ్వకపోవడం దారుణమైన విషయమని, ఇంతకంటే దారుణమైన విషయం కోటప్పకొండ చరిత్రలోనే లేదని , ఉచిత అన్నదానం చేసే వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని అయినప్పటికీ అన్నదానానికి అనుమతి నిరాకరించారని,
శ్రీ త్రికోటేశ్వరస్వామి దయవల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరణాళ్ళ జరగటం ఒక్కటే సంతోషం కరమైన విషయం అని, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయామని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారని, అసలు తిరణాళ్ళ కు సంబంధించిన పనుల మీద ఇంతవరకు ఎన్నికల కమిషన్కు ఎవరు ఎటువంటి కంప్లైంట్ చేయలేదని, వీళ్ళకు అభివృద్ధి పనులు చేయటం చేతకాక ,రోడ్లు వేయటం చేతకాక పనులు ,ఆలస్యంగా ప్రారంభించి ఎలక్షన్ కోడ్ అడ్డుగా చెబుతున్నారని ,మీరు అభివృద్ధి చేస్తే మేము వద్ద న్నామా ? ఇంకా ఆల్టర్నేటివ్ రూట్లు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తే ఇంకా మంచిదని ? కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి వచ్చిన ప్రభల పై దాడులు చాలా తీవ్రమైన అంశం అని ,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలను చాలా తీవ్రంగా పరిగణించాలని ,ఇటువంటి అరాచక చర్యలు చేసిన అరాచకవాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ,
పోసాని కృష్ణ మురళి ఎప్పుడో సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారని ఈరోజు అరెస్ట్ చేశారని ,
అలాగే వల్లభనేని వంశీ ఎప్పుడో పెట్టిన పోస్టులకి వారిని కూడా అరెస్టు చేశారని, మేము అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలి పెట్టమని ,ఇప్పుడు మీరు చేసిన ప్రతి అరాచకం పై ఫిర్యాదు ఇస్తామని ,ఇప్పుడు మీరు అరెస్ట్ చేయకపోయినా రేపు మేము అధికారంలో వచ్చిన తర్వాత అయినా అరెస్టు చేస్తామని , ఇటువంటి దాడులను చాలా తీవ్రమైన విషయముగా పరిగణిస్తామని, దూర దృష్టితో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, ఇటువంటి చర్యలు తప్పు! ఇటువంటి దాడులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నానని తక్షణమే తెలుగుదేశం వర్గీయులు చేసిన దాడులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గోనేపూడి మరియు అరవపల్లి గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.