నారద వర్తమాన సమాచారం
జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు
తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాలం టూ.. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జనసేన నేతలు.ఈరోజు కాకినాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే సభకు.. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి జనసేన శ్రేణులు ఉవ్వెత్తున తరలిరావాలంటూ పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్క కార్య కర్తపై ఉందన్నారు జనసేన నేతలు.
ఇప్పటికే పిఠాపురం శివారు చిత్రాడలోని సభాస్థలిని పరిశీలించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రధాన వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు, పార్టీ కార్యక్ర మాల నిర్వహణ విభాగా లకు సంబంధించి సూచన లు చేశారు.
మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్య లు చేపట్టాలని ఆయన అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత జరిగే ఈ వేడుకలను విజయ వంతం చేయాలని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. కాకినాడ జనసేన నేతలకు కీలక సూచనలు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.