నారద వర్తమాన సమాచారం
అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా క్యాండిల్స్ తో ర్యాలీనిర్వహించినమహిళా శిశు సంక్షేమశాఖ.
నరసరావుపేట
అంతర్జాతి మహిళా దినోత్సవం సందర్భం గా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో సఖి వన్ స్టాప్ సెంటర్ వారు ది. 04.03.2025 న మహాలక్ష్మి నగర్, నరసరావుపేట నందు ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహం నందు ఉన్న విద్యార్దునలతో క్యాండెల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ లో M. ఉమా దేవి , ప్రాజెక్ట్ డైరెక్టర్ ముఖ్య అతిధి గా పాల్గోని, అంగన్‌వాడీ సేవతో పాటుగా ఉన్నా వన్ స్టాప్ సెంటర్ యొక్క సేవాలను,స్త్రీ ల కోసం డిపార్ట్‌మెంట్ అందించు సేవాలను వివరించడం జరిగింది. ఈ ర్యాలీ లో అరుణ, నోడెల్ అధికారి ,ఎం.ఉమాదేవి, సిడిపిఓ, పి. స్రవంతి, జి. నవీన ఓ .ఎస్.సి. కేస్ వర్కర్లు వాణి శ్రీ, లాయర్, సంగీత , డి. వి.సి.కౌన్సెలర్ తదితరులు పాల్గోని కాండెల్ ర్యాలీ ద్వార ప్రజలలో అవగాహన కలిపించడం జరిగింది.