నారద వర్తమాన సమాచారం
లైసెన్స్ లేకుండా బల్లకట్లు నడిపితే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్
పల్నాడు జిల్లా నరసరావుపేట
జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నందు బల్లకట్టు/ పడవల పై జరిగిన సమావేశము ది.05.03.2025 న సా.4.00గం లకు శ్రీయుత జిల్లా సంయుక్త కలెక్టర్ వారి అధ్యక్షతన జరిగినది, ఈ సమావేశమునందు బల్లకట్టు/ పడవల పై ప్రజలు ప్రయాణించు సమయంలో వారు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు అనుమతులు/ లైసెన్సులు లేకుండా బల్లకట్టు/పడవల ను నడుపు వారి పై తగు చర్యలు తీసుకొనవలసినది గా ఆయా శాఖల అధికారులను ఆదేశించియున్నరు, ఈ కార్యక్రమములో జిల్లా రెవెన్యూ అధికారి ఇ. మురళి , రెవెన్యూ డివిజినల్ అధికారి, సత్తెనపల్లి మరియు గురజాల, డిఎస్పీ గురజాల, జెడ్పీ సీఈఓ గుంటూరు, జిల్లా టూరిజం అధికారి, తహశీల్దార్ లు మరియు పోలీసు సిబ్బంది హాజరు అయినారు.