నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో సరదా సరదాగా ఒకరోజు
ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు
నరసరావు పేట,
స్థానిక కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు పోటీలను ప్రారంభించగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన మహిళా ఉద్యోగులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వాలీబాల్, టెన్నికాయిట్ వంటి ప్రొఫెషనల్ ఆటలతో పాటూ మ్యూజికల్ చైర్స్, స్పూన్ రన్నింగ్ రేస్, కళ్ల గంతల వంటి సరదా ఆటలతో మహిళా ఉద్యోగులు రోజంతా ఉల్లాసంగా గడిపారు.
వేడుకలలో భాగంగా మహిళా ఉద్యోగుల సేవలు స్మరించుకుంటూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస రావులు పింక్ బెలూన్లు ఎగరేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్వో మురళి, డీఎఫ్ఓ కృష్ణప్రియ, ఆర్డీవో మధులత, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
విజేతలకు మార్చి 8న బహుమతులు అందజేస్తాం: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
క్రీడా పోటీల్లో విజయం సాధించిన మహిళలకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు.
రోజువారీ పనులతో బిజీగా ఉండే మహిళా ఉద్యోగులు తమకోసం ఒకరోజు గడిపేందుకు, తోటి మహిళా ఉద్యోగులతో తమ అభిప్రాయాలు పంచుకునేందుకు అందరికీ ఒకే చోట క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. ఉదయం ఔట్ డోర్ గేమ్స్ కు ప్రాధాన్యతనిచ్చినా.. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం నుంచి చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ నిర్వహించామన్నారు.
దాదాపు 500 మంది వరకూ మహిళా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేశారన్నారు. డీఎఫ్ఓ నేతృత్వంలోని అర్జనైజింగ్ కమిటీ కార్యక్రమం కోసం చక్కటి ఏర్పాట్లు చేసిందని అభినందించారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పరేడ్ గ్రౌండ్ లో క్రీడల పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
గురువారం రోజంతా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఎండ తీవ్రత దృష్ట్యా షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటూ ప్రతి మహిళా ఉద్యోగికి తెల్లటి టోపీలు అందజేశారు. మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్ లోనే జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు స్వయంగా అందరికీ రుచి కరమైన భోజనాలు వడ్డించారు. పోలీసు ఆయుధాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.