నారద వర్తమాన సమాచారం
మాచవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామంలో హ్యాండ్ అఫ్ హోప్ వారి ఉచిత మెగా వైద్య శిబిరం
చెన్నాయిపాలెం:-
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామంలో జిసస్ మైసెవియర్ మినిస్ట్రీష్ వారి అదర్యంలో ఈరోజు హ్యాండ్ ఆఫ్ హోప్ వారి మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ వైద్య శిబిరంలో 456 మందికి ఉచితంగా ఎటువంటి డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు లేకుండా రక్త పరీక్షలు, బిపి , షుగర్, ఎక్స్-రే, ఇ సి జి, కంటి పరీక్షలు మరియు అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. అని మెడికల్ క్యాంపు టీమ్ లీడర్ జంగా జయరాజు తెలిపారు.
ఈ మెడికల్ క్యాంపులో ఎక్సరే మరియు ఈసీజీ, దంత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో
ప్రముఖ డాక్టర్లు , డా.స్వాతి డా.భారత్, డా. భక్తసింగ్ , డా.మనోజ్ఞ , డా.సంపత్ మరియు ఆశ్రయం, పారామెడికల్ స్టాఫ్ మరియు
ల్యాబ్ టెక్నీషియన్స్ కుసుమ,
ఫార్మసీ స్వామి, సమూయేలు, నరసింహ,రవి, సొలొమోను మరియు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వారు చెన్నాయి పాలెం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.