నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట
మహిళ సాధికారతే లక్ష్యంగా సాగిన అవగాహన ర్యాలీ .
మహిళా సాధికారతే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సాగిన అవగాహన ర్యాలీ.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశాల మేరకు శనివారం ఉదయం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మున్సిపల్ గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు మహిళ పోలీసులు, మహిళ పోలీసు సిబ్బంది రెవిన్యూ అధికారులు మరియు సిబ్బంది తో అదనపు ఎస్పీ J.V సంతోష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మహిళా సాధికారత, చైతన్యం, ప్రగతి తదితర అంశాలపై జై జై పలికారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర డిజిపి ఉత్తర్వులు మేరకు గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
విద్యార్థినిలు,
గ్రామీణ స్త్రీలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించామన్నారు.
ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషను పరిధిలో వ్యాసరచన, డిబేట్, పెయింటింగ్, చిత్రలేఖనం, ఓపెన్ హౌస్ వంటి కార్యక్రమాలు నిర్వహించి మహిళా చట్టాలు, పోలీసు దైనందిన కార్యక్రమాలలో విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో పనిచేస్తున్న ప్రతి మహిళ పోలీసు ఉద్యోగికి మహిళ పోలీసులకు ఉచిత మెగా వైద్య శిబిరాలు ద్వారా వైద్య పరీక్షలు జరిగేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
మహిళలు చిన్నారులు భద్రతకు జిల్లా పోలీసు యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా పోలీస్ శాఖ వారు అందించే పోలీస్ సేవలను జిల్లా మహిళలు అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ర్యాలీ అనంతరం కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్ నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన స్టాళ్లను వచ్చిన విద్యార్థులు మరియు రెవెన్యూ
సిబ్బంది ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం జరిగింది.
కలెక్టర్ ఆఫీస్ గుర్రం జాషువా కాన్ఫరెన్స్ హాల్ నందు ఇన్చార్జి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు పొందిన వారికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అడిషనల్ ఎస్పీ J.V. సంతోష్
డి ఏఫ్ ఓ కృష్ణాప్రియ ICDS M. ఉమాదేవి DEO చంద్రకళ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకటరమణ , మహిళా స్టేషన్ సిఐ సుభాషిని పాఠశాల మరియు కళాశాల విద్యార్థినులు, మహిళా పోలీసులు మహిళా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సుమారు 600 మంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.