నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా సచివాలయాల పరిధిలో వివిధ రకాల సర్వేల ను రానున్న మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించిన కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
జిల్లాలోని సచివాలయాలలో చేపడుతున్న వివిధ రకాల సర్వే ప్రక్రియ రానున్న మూడు రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ .పి.అరుణ్ బాబు ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని యస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి మండల అధికారులతో వివిధ అంశము లపై విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రబుత్వం నిర్దేశించిన వివధ రకాల సర్వే లలో ఎ.యన్.యం లు తప్ప మిగిలిన సచివాలయ సిబ్బందిని సర్వే ప్రక్రియలలో వినియోగించుకొని త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు. క్లస్టర్ మరియు లక్ష్యాలను ఇచ్చి సర్వే ప్రక్రియను పూర్తీ చేయాలన్నారు. సర్వే ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన వారిపై కటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజా పిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. అదేవిధముగా నాణ్యమైన పరిష్కారం చూపాలని , బియాండ్ యస్.యస్.ఎ కుపోకుండా చూడాలన్నారు. ఇరిగేషన్ శాఖ పై సమీక్షిస్తూ నీటిని అవసరానికి వినియోగించుకోవాలని, అనవసరంగా నీటిని వాడ వద్దన్నారు. త్రాగు నీటికి అధిక ప్రాధ్యానత ఇవ్వడం జరుగుతుందన్నారు. పంట వేసిన చివరి ఆయకట్టు వరకు నీరు అందించడం జరుగుతున్నదని, ఎ ఒక్క రైతు నీరు అందలేదని పిర్యాదు అందకూడదని అధికారులను ఆదేశించారు. మండల అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ముందు చూపుతో అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతి రాజ్ శాఖపై సమీక్షిస్తూ పారిశుధ్యం నిర్మూలన , మరియు పన్ను వసూలు పనులుచేయడం తో పాటు చెత్త నుండి సంపద తయారు పై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మండల , ప్రభుత్వ కార్యాలలకు వచ్చే ప్రజలకోసం త్రాగు నీటిని ఏర్పాటు చేయాలన్నారు. నీటి లబ్యత ను గిర్తించడం తో పాటు అవరమైన చోట బోర్లకు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. యం.జి.యన్.ఆర్.ఇ,జి.యస్ పనులకు సంబందించి లేబర్ బడ్జెట్ ను సకాలంలో వంద శాతం వినియోగించు కోవాలన్నారు. ఈ కార్యక్రమములో సి.పి.ఓ, శ్రీనివాసరావు, జిల్లా పంచాయతి అదికారి భాస్కర రెడ్డి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి హీరాలాల్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళి, యన్.యస్.పి.ఈ.ఈ. కృష్ణ మోహన్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ……..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.